RTC | Strike | Telangana | Buses

Rtc employees strike either got positive responce or negetive responce from govt

RTC, Strike, Telangana, Buses, Unions, Fitment

RTC employees strike either got positive responce or negetive responce from govt. In telangana 25percent buses came on roads.

ఆర్టీసీ సమ్మెపై ముందుకు లేదు వెనక్కి లేదు

Posted: 05/09/2015 07:37 AM IST
Rtc employees strike either got positive responce or negetive responce from govt

ఆర్టీసీలో సమ్మె నాలుగో రుజు కూడా కొనసాగుతోంది. బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్నామ్నాయ ఏర్పాట్లు నామమాత్రంగా కొనసాగాయి. శుక్రవారం తెలంగాణ జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు  25 శాతం బస్సులు రోడ్డెక్కాయి.  10 జిల్లాల్లో 2137 బస్సులు తిరిగినా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు. చెదురు మదురు ఘటనలు మినహా తెలంగాణలో సమ్మె ప్రశాంతంగా సాగింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం కార్మికులపై లాఠీలు ఝుళిపించింది. మరోవైపు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపడంతోపాటు రెగ్యులర్ రైళ్లకు అదనపు బోగీలను చేర్చి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నది.

ఆర్టీసీ యాజమాన్యంతో బస్‌భవన్‌లో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. 43 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ చేసే వరకు సమ్మె కొనసాగుతుందని తెలంగాణ మజ్దూర్ యూనియన్ , ఎంప్లాయీస్ యూనియన్  ప్రకటించాయి. చర్చల్లో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) సాంబశివరావుకు టీఎంయూ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. కాగా, సంస్థ ఉద్యోగుల వేతనాల నుంచి కార్మిక సంఘాల సభ్యత్వ చందా వసూలు, కార్మిక సంఘాల సభ్యుల ఆన్ డ్యూడీ వసతులను రద్దుచేస్తూ ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. సంస్థ యాజమాన్యం తీరుకు నిరసనగా ఈయూ ప్రధాన కార్యదర్శి కే పద్మాకర్ ఆర్టీసీ బోర్డు డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RTC  Strike  Telangana  Buses  Unions  Fitment  

Other Articles