Rahul gandhi | Tour | Telangana

Aicc congress vice president rahul gandhi tour in telangana postponed

Rahul gandhi, Tour, Telangana, Congress, Uttam kumarreddy,

Aicc congress vice president Rahul gandhi tour in Telangana postponed. Rahul gandhi office ofificially informed to telangana congress leaders in the late night.

ఏం నాయనా పర్యటన వాయిదా పడిందా?

Posted: 05/09/2015 07:46 AM IST
Aicc congress vice president rahul gandhi tour in telangana postponed

ఎవరో వస్తారని .. ఏదో చేస్తారని ఎదరు చూసి మోసపోకుమా.. నిజం తెలిసి అంటూ తెలుగు సినిమాలో ఓ పాట ఉంది. పాపం కాంగ్రెస్ నాయకులకు ఈ పాటలో భావం అర్థం కాలేదేమో.. అందుకే కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ వచ్చి తెలంగాణ లో ఏదో మాయ చేస్తారని అనుకున్నారు. కానీ ఆరంభం కూడా కాలేదు అంతలోనూ అపశకునం అన్నట్లు రాహుల్ గాంధీ పర్యటన వాయిదా పడింది. రాహుల్‌ తెలంగాణ పర్యటన మూడు రోజులు వాయిదా పడింది. ఆయన ఈనెల 11, 12 తేదీలకు బదులు 14, 15 తేదీల్లో రాష్ట్రంలో రైతు భరోసా యాత్ర నిర్వహిస్తారు. పార్లమెంటు సమావేశాలను కేంద్ర ప్రభుత్వం పొడిగించడంతో వాటిల్లో పాల్గొనేందుకు అనువుగా రాహుల్‌గాంధీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన కార్యాలయం ట్విట్టర్‌లో వెల్లడించింది. పార్లమెంటులో భూసేకరణ ఆర్డినెన్స్ పై జరిగే చర్చలో ఆయన పాల్గొని ప్రసంగించాలని నిర్ణయించారని, దీనికి అనుగుణంగా పర్యటన తేదీలను మార్చారని తెలిపింది. రాహుల్ యాత్ర వాయిదాపై ఆయన కార్యాలయం నుంచి తెలంగాణ కాంగ్రెస్ నేతలకు  సమాచారం వచ్చింది.

రాహుల్ పర్యటన తేదీలు మాత్రమే మారాయని, గతంలో నిర్ణయించిన కార్యక్రమాలు యథాతథంగా ఉంటాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 14న సాయంత్రం ఆయన రాష్ట్రానికి వస్తారని, హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా తూప్రాన్, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి, ఆర్మూర్, బాల్గొండల మీదుగా నిర్మల్‌కు వెళ్లి అదేరోజు రాత్రి అక్కడ బస చేస్తారని, 15న ఉదయం అక్కడ 5 గ్రామాల్లో 15 కిలోమీటర్ల మేరకు పాదయాత్రను నిర్వహిస్తారని తెలిపారు. తాను, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, మండలి విపక్ష నేత షబ్బీర్అలీలతో కలిసి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించామని వెల్లడించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul gandhi  Tour  Telangana  Congress  Uttam kumarreddy  

Other Articles