తాజాగా హైదరాబాద్ లో జరిగిన స్ట్రీట్ ఫైట్ పై సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే ఓ వ్యక్తి మృతి చెందిన తర్వాత కానీ హైదరాబాద్ పాతబస్తీ లాంటి ప్రదేశాల్లో ఏం జరుగుతోందో బయటిలోకానికి తెలియదు. అయితే స్ట్రీట్ ఫైట్ గురించి తప్పుపట్టడం కన్నా.. దానికి అవకాశం కల్పించడంపైనే మనం మాట్లాడుకోవాలి. అంటే ఉద్దేశం స్ట్రీట్ ఫైట్ కల్చర్ సిటీ యూత్ ను పెడదారి పట్టిస్తోంది. పేరెంట్స్ బిజీ లైఫ్.. పిల్లలపై ప్రభావం చూపుతోంది. కంట్రోల్ లేకపోవటంతో.. విచ్ఛలవిడి తత్వం పెరిగిపోతోంది. హైదరాబాద్ లో బైక్ రేస్, కార్ రేసులతోపాటు.. స్ట్రీట్ ఫైటింగ్ కూడా హాబీగా మారింది. ప్రాణాపాయమని తెలిసినా.. ఉడుకు రక్తం.. వెనక్కితగ్గటంలేదు. ప్రాణాలు పోయాక తేరుకుని.. లబోదిబోమంటున్నారు తల్లిదండ్రులు. సినిమాల ఎఫెక్ట్ టీనేజ్ పై ఫుల్ గా ఉంటోంది. సినిమాల్లో చేసేవి డూప్ ఫైట్లయినా.. రియల్ లైఫ్ లో హీరోల్లా ఫీలైపోతున్నారు యూత్. సిక్స్ ప్యాక్ లపై చూపుతున్న ఇంట్రెస్ట్.. ఎడ్యుకేషన్ పై చూపటంలేదు. తల్లిదండ్రులు కూడా పెద్దగా పట్టించుకోకపోవటంతో.. బలాదూర్ గా మారిపోతున్నారు. చెడుమార్గంలో నడుస్తున్నారు.
స్ట్రీట్ ఫైట్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గతంలో జరిగిన స్ట్రీట్ పైటింగ్ఖ సీన్లకు పాపులారిటీ పెరడగం విశేషం. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న రియల్ ఫైటింగ్ సీన్లు.. పిల్లలపై ఫుల్ ఎఫెక్ట్ చూపుతున్నాయి. రియల్ ఫైటింగ్ సీన్లకు అట్రాక్ట్ అవుతున్న టీనేజర్లు.. ఎవరికి వారు హీరోల్లా ఫీలవుతున్నారు. పంచ్ లకు రెడీ అంటున్నారు. హైదరాబాద్ గల్లీల్లో స్ట్రీట్ ఫైటింగ్ కల్చర్ పెరిగిపోతోందనే ఆరోపణలు గతంలోనే వినిపించాయి. టీనేజ్ లో తల్లిదండ్రుల భయం పిల్లలకు లేకపోవడంతో పిల్లలకు స్వేచ్ఛ పరిధులు దాటుతోంది ఇలా తమ పరిధిని దాటిన పిల్లలు ఏకంగా బెట్టింగ్ లకు దిగుతున్నారు. నబీల్ లాంటి యువకులు ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడే.. రియాక్టవుతున్నారు పోలీసులు. రియల్ హీరోల్లా ఫీలవుతున్న యువకులు ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. యూత్ లో పరివర్తన తెచ్చే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు విద్యావేత్తలు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more