కీలక కేసుల్లో కోర్టులు నిందితులకు బెయిల్ లు మంజూరు చెయ్యడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మొన్న హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్, నిన్న అక్రమంగా ఆస్తులను కలిగి ఉన్న కేసులో జయలలిత, మరి రేపు ఎవరు అంటూ జనాలు మాట్లాడుతుండగానే సత్యం రామలింగరాజుకు కోర్టు బెయిల్ మంజూరు చేసేసింది. రామలింగరాజుకు ఊరట లభించింది. సత్యం కుంభకోణం కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. రామలింగరాజుతో పాటు మిగతా నిందితులకు కోర్టు బెయిల్ ఇచ్చింది. రామలింగరాజు, రామరాజు రూ.లక్ష చొప్పున, మిగతా నిందితులు రూ.50 వేలు పూచికత్తు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కాగా సత్యం కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తనకు ఏడేళ్లు జైలు శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ ఆయన నాంపల్లి కోర్టులలో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు సహా 10 మందిని ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించింది. వారందరికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతోపాటు మొదటి, రెండో నిందితులుగా ఉన్న రామలింగరాజు, రామరాజుకు భారీగా, ఇతర నిందితులకు లక్షల్లో జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మొత్తానికి కోర్టులు ఇలా వరుసగా ఫేమస్ పర్సనాటిలీలకు అనుకూలంగా బెయిల్ లు మంజూరు చెయ్యడం నిజం అనుకోకుండా జరుగుతుందేమో కానీ ప్రజలకు మాత్రం కావాలనే జరుగుతుంది అన్న అనుమానాలకు తావిస్తోంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more