Ap | Capital | Modi | Inauguration | June6

Ap cabinet decided to inauguration of new capital city

Ap, Capital, Modi, Inauguration, June6,

Ap cabinet decided to inauguration of new capital city. Cn chandrababu and pm modi will inaugurate capital city on june 6.

రాజధాని నిర్మానానికి శంకుస్థాపన... జూన్ 6న

Posted: 05/13/2015 09:45 AM IST
Ap cabinet decided to inauguration of new capital city

కనీసం రాజధాని కూడా లేకుండా.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఏపికి ఇప్పుడిప్పుడు మంచి రోజులు వస్తున్నాయి. భవిష్యత్ మీద బొలెడన్ని ఆశలతో కొత్త రాజధాని నిర్మాణానికి.. చరిత్రలో కొత్త పేజీకి ముహూర్తం ఖరారైంది. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి భూమి పూజ ముహూర్తం ఖరారైంది. జూన్ 6న శంకుస్థాపన చేసి దసరా నుంచి నిర్మాణ పనులు మొదలుపెట్టబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించే అవకాశాలున్నాయి. రాజధాని నగర నిర్మాణం, భూమి పూజ అంశాలపై మంగళవారం సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరిగింది.

జూన్ మొదటి వారం తర్వాత మంచి ముహూర్తాలేవీ లేవని పండితులు వెల్లడించారు. దాంతో ఒకవేళ జూన్ మొదటివారం మిస్సయితే  మరో బలమైన ముహూర్తం కావాలంటే 2016 మార్చి వరకూ ఆగాల్సిన పరిస్థితి. జూన్ 5, 6, 8 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయని పండితులు స్పష్టం చేశారు. ఈ అంశం మంత్రివర్గం ముందుకు చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జూన్ 6న శంకుస్థాపనకే మొగ్గు చూపారు. ఏ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదు. సింగపూర్ నిపుణుల నుంచి రాజధానికి సంబంధించిన స్పష్టమైన ప్రణాళిక మాత్రం జూన్ తర్వాతే వస్తుంది. ముందుగా శంకుస్థాపన చేసినా పూర్తిస్థాయిలో నిర్మాణ పనులు దసరా నుంచే మొదలవుతాయి.

మంత్రివర్గ సమావేశంలో నూతన రాజధాని నిర్మాణం, ఏపీ నుంచే పాలన సాగించాలనే అంశాలపై ప్రధానమైన చర్చ జరిగింది. విభజన జరిగి సంవత్సరం కావస్తుండటంతో హైదరాబాద్‌లో ఎక్కువ కాలం ఉండటం సాధ్యం కాదని.. విజయవాడ, గుంటూరు ప్రాంతాల నుంచే పాలన వ్యవస్థను సాగించాలని ఏపి ప్రభుత్వం ఆలోచిస్తోంది. నడిపించబోతున్నారు. వారంలో మూడు రోజులపాటు విజయవాడలోనే ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించుకొన్నారు. వచ్చే నెల 2 నుంచి విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభం కానుందని మంత్రి వర్గం తెలిపింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap  Capital  Modi  Inauguration  June6  

Other Articles