MP Kavita Settairs on Rahul Gandhi Telangana Tour | Telangana Congress Party | TRS Party Updates

Mp kavita settairs controversial comments rahul gandhi telangana tour

kavita news, kavita updates, kavita comments, kavita controversy, mp kavita controversies, mp kavita comments, mp kavita rahul gandhi, rahul gandhi news, rahul gandhi telangana tour, telangana tours, rahul telangana news

MP Kavita Settairs Controversial Comments Rahul Gandhi Telangana Tour : Nizamabad MP kavita makes controversial comments on Rahul Gandhi. In this press meet she demands rahul to explain what they have done in their 60 years ruling.

రాహుల్ ‘తెలంగాణ పర్యటన’పై ఎంపీ కవిత కస్సుబుస్సు

Posted: 05/14/2015 10:19 AM IST
Mp kavita settairs controversial comments rahul gandhi telangana tour

‘రైతు భరోసా యాత్ర’ పేరిట కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నమవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో.. ఆయన మీద టీఆర్ఎస్ పార్టీ తనదైన శైలీలో సెటైర్లు వేస్తోంది. ఓవైపు కాంగ్రెస్ తమ యువరాజు రైతుల్లో ధైర్యాన్ని నింపేందుకు తెలంగాణకు విచ్చేస్తున్నారని డప్పులు వాయించుకుంటుంటే.. టీఆర్ఎస్ రకరకాల కామెంట్లు చేస్తోంది. ఇప్పటికే ఈయన యాత్రపై హరీశ్ రావుతోపాటు మరికొంతమంది టీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పించగా.. తాజాగా నిజామాబాద్ ఎంపీ కవిత, సీఎం కేసీఆర్ కుమార్తె కవిత కస్సుబుస్సుమన్నారు.

రాహుల్ గాంధీ పర్యటన ఉద్దేశం రైతుల ఉద్దరణ కాదని తాజాగా కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం కోసమే రాహుల్ పర్యటిస్తున్నారని.. దానికి రైతుల భరోసా అన్న పేరు ఇచ్చుకున్నారని ఆమె అన్నారు. 60 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఇంతవరకు రైతులకు ప్రత్యేకంగా ఏం చేసిందో చెప్పాలని ఆమె రాహుల్ ని డిమాండ్ చేశారు. తాము కూడా రాహుల్ పర్యటనను పరిశీలిస్తామని.. ఈ క్రమంలో ఆయన రైతుల ఆత్మహత్యల నివారణకు ఏ విధమైన సలహాలిస్తారో చూస్తామని ఆమె అన్నారు. అయినా.. రాహుల్ పర్యటనతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేమీ లేదన్నట్లుగా ఆమె అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

అటు కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ పర్యటన మీద బాగానే డప్పులు వాయించేసుకుంటున్నారు. రాహుల్ రైతులను పరామర్శించి.. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తారని చెబుతున్నారు. ఆత్మహత్యల బాటపడుతున్న రైతుల్లో ధైర్యాన్ని నూరిపోసేందుకు రాహుల్ తెలంగాణకు వస్తున్నారని చెబుతున్నారు. మరి.. ఈయన పర్యటనతో ఏ విధమైన మార్పులు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mp kavita controversy  Rahul gandhi  Congress telangana tour  

Other Articles