Mystery Behind Kurnool Constables death reveals | Murali Krishna | Veeresh | sister marriage incident

Mystery behind kurnool constables death reveals sister marriage incident

kurnool constable incident, murali krishna veeresh suicide news, kurnool constables suicide case, kurnool police investigation, police suicide case news, murali krishna killed veeresh, murali krishna veeresh incident, murali krishna firing news, kurnool constables

Mystery Behind Kurnool Constables death reveals sister marriage incident : Finally Kurnool Police has revealed the myster behind muralikrishna and veeresh death incident which gone viral in ap state. In police enquiry it has been revealed that murali killed veeresh with pistol for not accepting to marry his sister.

కర్నూలు కానిస్టేబుళ్ల మృతి ‘మిస్టరీ’లో ‘చెల్లి’ పెళ్లి?

Posted: 05/14/2015 08:56 AM IST
Mystery behind kurnool constables death reveals sister marriage incident

కర్నూలులో ఇద్దరు కానిస్టేబుళ్లు మురళీకృష్ణ, వీరేష్ మృతిచెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొదట వారిద్దరి మృతిపై రకరకాల కథనాలు వెలువడ్డాయి. ఆ కానిస్టేబుళ్ల మధ్య స్వలింగ సంపర్క బంధం కొనసాగిందని.. వారిలో మురళికి పెళ్లి నిశ్చయం కావడం విషయం తెలుసుకున్న వీరేష్ జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని.. ఆ బాధను దిగమింగుకోలేక మురళీ సూసైడ్ చేసుకున్నాడని కథనాలు వెలువడ్డాయి. అయితే.. ఈ ఘటనలో రకరకాల అనుమానాలు రేకెత్తగా పోలీసులు తమదైన తరహాలో విచారణ చేపట్టారు. దీంతో ఈ మొత్తం వ్యవహారం వెనుకున్న అసలు మిస్టరీ ఏంటో బట్టబయలైంది.

వివరాల్లోకి వెళ్తే.. మురళీ చెల్లెల్ని వీరేష్ గతకొన్నాళ్ల నుంచి ప్రేమిస్తూ వచ్చాడు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇంతలోనే ఏమయ్యిందో ఏమో వీరేష్ పెళ్లికి నిరాకరించాడు. దీంతో కోపాద్రిక్తుడైన మురళీ.. తన చెల్లిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినందుకే వీరేష్ ని పిస్టల్ తో కాల్చి చంపినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. మురళీకృష్ణ స్నేహితుడు, ఎల్‌బీఎస్ నగర్ వాసి అయిన శ్యామ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అలాగే కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులతో కూడా కొన్ని విషయాలను సేకరించారు. దీంతో అసలు విషయం బయటపడింది. స్నేహితుడు శ్యామ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు సెక్షన్ 174 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు ఇద్దరు కానిస్టేబుళ్ల మృతదేహాలకు బుధవారం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో పోలీసు వైద్యులు లక్ష్మినారాయణ, సాయి సుధీర్ శవపరీక్షలు నిర్వహించారు. ఇద్దరి తలల్లో ఉన్న బుల్లెట్లను బయటికి తీశారు. వీరేష్ ముందు చనిపోయినట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. కాల్పులకు ముందు ఇద్దరి మధ్యన పెనుగులాట జరిగినట్లు శవ పరీక్షల్లో వెల్లడైనట్లు సమాచారం. శవ పరీక్ష అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఇదిలావుండగా.. గన్‌మెన్ విధుల్లో ఉన్న మురళీకృష్ణ.. పోలీస్ పికెట్ విధుల్లో ఉన్న వీరేష్.. ఇద్దరూ కర్నూలుకు ఎప్పుడు, ఎందుకు, ఎవరి అనుమతితో వచ్చారనే అంశాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. మురళీకృష్ణ తన పిస్టల్‌ను హెడ్ క్వార్టర్‌లో డిపాజిట్ చేయకుండా తనదగ్గరే ఎందుకు ఉంచుకున్నాడనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kurnool constables death  police investigation  murali krishna  veeresh  

Other Articles