Eamcet Students life ruined one minute late rule | Eamcet Examinations Hyderabad

Eamcet examinations one minute late rule students life

eamcet exams, eamcet examinations, eamcet students, hyderabad eamcet centers, engineering eamcet exams, medical eamcet exams

Eamcet Examinations one minute late rule students life : Students crying for not allowing them to write eamcet examinations for coming one minute late to center.

ఎంసెట్ విద్యార్థులను నిండాముంచిన ‘నిముషం’ నిబంధన

Posted: 05/14/2015 11:38 AM IST
Eamcet examinations one minute late rule students life

తెలంగాణ సర్కార్ నిర్వహించిన ఎంసెట్ పరీక్షల్లో భాగంగా ‘నిముషం’ నిబంధనను అమలులోకి తీసుకొచ్చారు. ఈ నిబంధన ప్రకారం విద్యార్థులు ఒక్క నిముషం ఆలస్యమైతే ఎటువంటి పరిస్థితుల్లోనూ పరీక్షకు అనుమతించరు. అధికారులు చేసిన ఈ హెచ్చరికల నేపథ్యంలో చాలామంది విద్యార్థులు పరీక్ష సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. కానీ.. ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను మాత్రం ఆ నిబంధన నిండా ముంచేసింది.

ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఈ ఎంసెట్ పరీక్ష.. ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులందరికీ ఎంతో కీలకమైనవి. ఇంటర్ తర్వాత తదుపరి కోర్సులను నిర్దేశించే ఈ పరీక్షల మీదే వారి భవితవ్యం ఆధారపడి వుంటుంది. అటువంటి అత్యంత కీలకమైన ఈ పరీక్షల్లో భాగంగా ప్రవేశపెట్టిన ఒక్క నిముషం నిబంధన విద్యార్థులను నిండా ముంచేసింది. నిముషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించమన్న నిబంధనను అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఇంజనీరింగ్ ఎంసెట్ పరీక్షలకు కొందరు విద్యార్థులు హైదరాబాదులోని పలు పరీక్షా కేంద్రాలకు కేవలం నిముషం వ్యవధి మాత్రమే ఆలస్యంగా వచ్చినా.. నిబంధన ప్రకారం వారిని పరీక్షలు రాసేందుకు లోపలికి పంపించలేదు.

గేటు బయటే నిలబడిన విద్యార్థులు.. తమకు పరీక్ష రాసేందుకు లోనికి అనుమతించాల్సిందిగా ఎంతగా వేడుకున్నప్పటికీ అధికారులు కనికరించలేదు. దీంతో విద్యార్థులు గేటు వద్దే కన్నీరుమున్నీరయ్యారు. తమ భవితవ్యాన్ని నిర్దేశించే ఈ అత్యంత కీలకమైన పరీక్షలు రాసేందుకు ‘నిముషం’ నిబంధన నిండా ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eamcet exams  one minute late rules  

Other Articles