kerala woman gangrape in ponnur railway station

Kerala women gangraped in andhrapradesh

gangrape in guntur, gang rape in AP, gangrape on beggar, gangrape in nidubrolu railway station, gangrape on railway tracks, rickshaw pullers gangrape, violence on women, crime against women, harrasment on woman, gangrape, ponnur railway station, kerala woman, gang rape on keralal girl, accused in police custody,

rickshaw pullers in ponur railway station gangraped tamil women

గుంటూరులో దారుణం.. కేరళ యువతిపై గ్యాంగ్ రేప్

Posted: 05/14/2015 12:16 PM IST
Kerala women gangraped in andhrapradesh

గుంటూరు జిల్లా మరో దారుణం జరిగింది. పోరుగు రాష్ట్రానికి చెందిన యువతిపై అక్కడి మానవ మృగాళ్లు పైచాచికంగా దాడికి తెగబడ్డాయి. గుంటూరు జిల్లాలోని నిడుబ్రోలు మండలం పొన్నూరు రైల్వే స్టేషన్ ఆవరణలో గురువారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఎందుకని వచ్చిందో తెలియదు..లేక ఎందుకు రైల్వేస్టేషన్ ఫ్లాట్ ఫాంపై ఆశ్రయాన్ని పోందిందో తెలియదు. కానీ కేరళకు చెందిన ఇరవై రెండేళ్ల యువతి గత రెండు రోజులుగా రైల్వే స్టేషన్లో వుంది. ఈ విషయాన్నినిడుబ్రోలుకు చెందిన రిక్షా కార్మికులు గమనించారు. సదరు యువతిపై కన్నువేశారు.

గురువారం తెల్లవారుజామున రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారంపై పడుకుని ఉన్న ఆమెను నిద్రలేపిన ముగ్గురు రిక్షా కార్మికులు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. వారికి సహకరించని యువతిపై దాడి చేశారు. అనంతరం ఆమెను రైలు పట్టాల పక్కకు లాక్కెళ్లి సామూహికంగా అత్యాచారం చేశారు. దాంతో యువతి స్పృహకోల్పోయింది. పరిస్థితి విషమంగా మారింది. శరీరంపై గాయాలతో మూలుగుతున్న ఆమెను గురువారం ఉదయం స్థానికులు గమనించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అయితే ఈ ఘటనపై రైల్వే పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్న తరుణంలో.. యువతిని పట్టించుకోకుండా నిందితుల కోసం పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన మీడియా ప్రతినిధులు పోలీసులను యువతి పరిస్థితిపై ప్రశ్నించడంతో బాధితురాలుని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. ఆ తరువాత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా రిక్షా కార్మికులు ఏసుబాబు, మాణిక్యాలరావును పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. పరారైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : gangrape  ponur railway station  tamil girl  

Other Articles