Ram Gopal Varma Compares KCR Beauty With Ileana and Nitya Menon Performance | Tollywood

Ram gopal varma compares kcr beauty with ileana and nitya menon performance

ram gopal varma, ram gopal varma twitter, cm kcr news, kcr controversy, goa beauty ileana, nitya menon news

Ram Gopal Varma Compares KCR Beauty With Ileana and Nitya Menon Performance : Controversial director ramgopal varma makes sensation by doing another comments on kcr. This time he compares kcr beauty with ileana and performance with nitya menon.

ఇలియానా కంటే కేసీఆర్ సారు మస్త్ అందగాడట!

Posted: 05/16/2015 03:00 PM IST
Ram gopal varma compares kcr beauty with ileana and nitya menon performance

అందం విషయంలో గోవా బ్యూటీ ఇలియానా కంటే తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా ‘బ్యూటీఫుల్’గా వుంటారట! అలాగే పెర్ఫార్మెన్స్ విషయంలో నటి నిత్యామీనన్ కంటే చాలా సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారని, ఆ విషయంలో ఆమె కంటే ఈయనే బెటరట! ఈ విధంగా సీఎం కేసీఆర్ ఆ రెండు తారలతో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మరెవ్వరో కాదు.. తన ట్వీట్ల ద్వారా సంచలనాల మోత మోగించే రాంగోపాల్ వర్మ!

రాంగోపాల్ వర్మ వ్యక్తిత్వం ఎలాంటిదో ఎవ్వరూ పసిగట్టలేరన్న విషయాన్ని ఆయన మరోసారి చేసి చూపించారు. సమయం, సందర్భం లేకుండా తనకిష్టమొచ్చినట్లుగా కామెంట్లు చేసే ఈయన.. ఆ తరహాలోనే తాజాగా కేసీఆర్ మీద తన ట్వీట్ల మోత మోగించేశాడు. సెక్సీ బ్యూటీ ఇలియానా కంటే కేసీఆర్ చాలా అందంగా ఉంటాడనీ, అలాగే నిత్యా మీనన్ కంటే సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారని కితాబిచ్చాడు. ఐతే ఇవి చెడ్డ మంచిదో లేదంటే మంచి చెడ్డదో తనకు తెలియదని కన్ఫ్యూజింగ్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.

kcr-rgv-tweet-news

గత ఏడాదిలో కూడా వర్మ ఇదేవిధంగా కేసీఆర్ పై ట్వీట్స్ చేసి సంచలనం సృష్టించారు. అప్పట్లో వర్మ తన ట్విట్టర్లో... అధికారం, దర్పం లాంటి అంశాలు కేసీఆర్‌ను అందగాడిని చేశాయంటూ పేర్కొన్నాడు. అలాగే సమంత, తమన్నా, ఇలియానాలు కలిపితే ఉండే అందమంతా కేసీఆర్‌లో కనిపిస్తోందని తెలిపాడు. ఈ క్రమంలోనే కేసీఆర్ ని హిట్లర్ తో పోల్చుతూనే.. కేసీఆర్ ఓ మంచి హిట్లర్ అంటూ పోస్ట్ చేసి చర్చనీయాంశమయ్యాడు. అంతేకాదు.. ఎన్టీఆర్ అనే పదం కంటే కేసీఆర్ వినడానికి బాగుందని కూడా అన్నాడు.

ఈ విధంగా వర్మ తరుచూ కేసీఆర్ పేరు మీద సంచలనాలు కామెంట్లు చేయడం.. అది కూడా చాలావరకు తారలతోనే పోల్చడంపై ఆంతర్యం ఏమిటన్న విషయం అంతుచిక్కడం లేదు. అటు గతంలో ఇతని ట్వీట్లకు తెరాస నుంచి కూడా ఎటువంటి స్పందన రావడం లేదు. వర్మ చేసిన తాజా ట్వీట్లపై ఆ పార్టీ నుంచి ఎవరైనా స్పందిస్తారా..? లేక గతంలోలాగే పట్టించుకోకుండా వదిలేస్తారా? అన్నది సందేహంగా మిగిలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RGV twitter  CM KCR  Ileana  nitya menon  

Other Articles