Tirumala | laddu | TTD | Srivari prasadam

Tirumala ttdp officers getting srivari laddu in unofficail way

Tirumala, laddu, TTD, Srivari prasadam

Tirumala ttdp officers getting srivari laddu in unofficail way. Vegilance officers took custody.

శ్రీవారి లడ్డూ కొట్టెయ్య కూడదు నాయనా..!

Posted: 05/16/2015 03:15 PM IST
Tirumala ttdp officers getting srivari laddu in unofficail way

ఆపద మొక్కుల వాడి ప్రసాదానికి కన్నం వేస్తున్నారు కొంత మంది కన్నింగ్ రాయుళ్లు. శ్రీవారి ప్రసాదం ఎంత ఫేమస్సో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ తిరుమల ప్రసాదం తింటే చాలు శ్రీవారి ఆశిర్వాలు లభిస్తాయన్న నమ్మకం చాలా మంది భక్తులది.  అందుకే ఎంత రిస్కైనా.. ఎన్ని గంటలు ప్రసాదం లైన్ లో నిల్చొనైనా లడ్డూలు పొందుతారు. అయితే లడ్డూ ప్రసాదానికి ఉన్న క్రేజ్ కారణంగా.. తిరుమత ప్రసాదంపై దొంగల కన్ను పడుతోంది. తరుచుగా లడ్డూల మాపియా గురించి వింటూనే ఉన్నాం.

ఇటీవల లడ్డూ కూపన్లలో నకిలీవి ఉన్నట్లు టీటీడీ ఉద్యోగులు గుర్తించి.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దాంతో టీటీడీ ప్రింటింగ్ ప్రెస్లో నకిలీ లడ్డూ కూపన్లు తయారవుతున్నట్లు గుర్తించి.. ఆ దిశగా విచారణ చేపట్టారు. దాంతో నిందితులను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శ్రీవారి లడ్డూ టోకెన్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్‌నుంచి ప్రింటింగ్ సిబ్బంది టోకెన్లను అపహరిస్తూ విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డారు. అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అప్పటికప్పుడు ఏదో తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటామని హడావిడి చెయ్యడం తర్వాత గాలికి వదిలెయ్యడం మామూలైపోయింది మరి ఈ సారి లడ్డూ దొంగల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో లేదా శరామామూలే కదా అని వదిలేస్తారో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tirumala  laddu  TTD  Srivari prasadam  

Other Articles