GVK | 108 | Strike | Employees

Gvk gave warning to 108 employees

GVK, 108, Strike, Employees, Warning

GVK gave warning to 108 employees. 108 employees on strike for their demands but 108 managment, GVK warn on strike. GVK messaged to 108 employees.

108 ఉద్యోగులకు బెదిరింపులు

Posted: 05/18/2015 09:30 AM IST
Gvk gave warning to 108 employees

తెలంగాణ వ్యాప్తంగా 108 సిబ్బంది సమ్మె కొనసాగుతోంది. అయితే సమ్మెను వెంటనే విరమించాలని.. లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఉద్యోగులకు మెసేజ్ లు పంపుతోంది జివికె యాజమాన్యం. దాంతో తమను బెదిరిస్తున్నారని 108 సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న తమపై యాజమాన్యం బెదిరింపు ధోరణిలో మెసేజ్‌లు పంపడంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె విరమించే ప్రసక్తేలేదని తేల్చిచెప్పారు. అక్రమంగా తొలగించిన ఉద్యోగులను తీసుకోవాలని, ఉద్యోగ భద్రత, కనీస వేతనం కల్పించాలని, ఎనిమిది గంటల పనివిధానాన్ని అమలు చేయాలని తదితర 15 డిమాండ్లతో రాష్ట్రంలోని 1650 మంది ఉద్యోగులు సమ్మెకు దిగారు.

ఉద్యోగులకు సమ్మె చేసే హక్కులేదని యాజమాన్యం హెచ్చరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 108 సమ్మె ప్రభావం ఏ మాత్రం లేదని.. కొత్తవారితో 95 శాతం వాహనాలు రోడ్లపై నడిపుస్తున్నామని పదేపదే ప్రకటిస్తున్న యాజమాన్యం వెంటనే విధుల్లో చేరాలని పేర్కొనడంపై అర్ధంలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో అటు ప్రభుత్వం, ఇటు జివికె యాజమాన్యం చేతులెత్తేయడం వల్లే ఉద్యోగులు సమ్మె చేయాల్సి వచ్చింది. దాంతో గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని 326 అంబులెన్సుల్లో 316 వాహనాలు నిలిచిపోయాయి. రోజుకు వెయ్యికిపైగా ఫోన్‌కాల్స్‌ అందుకుని సేవలందించే సంస్థ ఒక్క రోజుకు దాదాపు 200 కాల్స్‌ను పట్టించుకోలేని దుస్థితికి చేరుకుంది. ఈ పరిస్థితికి యాజమాన్యమే కారణమని ఉద్యోగులు చెబుతున్నారు. 108 నుండి జివికెను తప్పించి ఇతర సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GVK  108  Strike  Employees  Warning  

Other Articles