chandrababu | ap | capital | muhurtham

Nara chandrababu naidu discussing about the inaughration date and panchangam

chandrababu, ap, capital, muhurtham, panchangam

Nara chandrababu naidu discussing about the inaughration date and panchangam. Chandrababu belives in panchangam and muhurthams.

ఏం నాయనా చంద్రబాబు.. గ్రహ కుదిరిందా??

Posted: 05/18/2015 09:32 AM IST
Nara chandrababu naidu discussing about the inaughration date and panchangam

నారా చంద్రబాబు నాయుడుకు సెంటిమెంట్ ఎక్కువ అన్న విషయం అందిరికి తెలుసు. వాస్తు బాగోలేకసోతే.. ఏ మాత్రం మంచి జరగదని బావించే చంద్రబాబు వాస్తు ప్రకారం తన ఇంటినికానీ ఆఫీస్ ను కానీ మార్చడానికి ఎంత ఖర్చైనా చేస్తారు. మరి అలాంటిది ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నిర్మాణానికి మొదటి మైలు రాయి శంకుస్థాపనకు ఎంత జాగ్రత్త తీసుకుంటారు చెప్పండి. అందుకే అన్ని అనుకూలంగా ఉన్నాయా లేదా..? ఏమైనా గ్రహపాట్లు ఉన్నాయా..? ఆరంభిస్తే విజయం సొంతమవుతుందా లేదా.? ఇలా చాలా విషయాలను బేరీజు వేసుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు వేద పండితులతో తెగ మంతనాలు జరుపుతున్నారట.

ఆంధ్రరాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి భూమి పూజ చేసేందుకు వీలుగా చంద్రబాబునాయుడు తెగ హోం వర్క్ చేస్తున్నారు. జూన్ 6వ తేదీనే భూమి పూజను  చేయాలనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో జ్యేష్ఠ మాసం, పంచమి రోజు, ఉత్తరాషాఢ నక్షత్రంలో భూమిపూజను చంద్రబాబు నాయుడు చేస్తే బాగుంటుందని కృష్ణా జిల్లాకు చెందిన వేద పండితులు ప్రతిపాదించారు. ఈ ముహుర్తంపై మరి కొంతమంది వేద పండితులను కూడా సంప్రదించి ఒకటి రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉందని టిడిపి వర్గాలు పేర్కొన్నాయి. భూమి పూజ ప్రదేశాన్ని కూడా దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. కృష్ణా నదికి అభిముఖంగా ఈశాన్య దిక్కులో ఉద్దండరాయునిపాలెం, తాళ్లపాలెం మధ్య భూమి పూజ చేయాలని నిర్ణయించారు. నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేసి జూన్ 8వ తేదీకి ఏడాది అవుతుంది. ఆ లోగానే భూమి పూజ చేయాలనే యోచనతో చంద్రబాబు ఉన్నారు. రాజధాని అమరావతి పేరు బలం, చంద్రబాబు నాయుడు గ్రహస్థితిని, భూమి పూజ చేసే స్ధలాన్ని బట్టి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. మొత్తానికి చంద్రబాబు నాయుడుగారి సెంటిమెంట్ మాత్రం వార్తల్లో చర్చనీయాంశమే.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  ap  capital  muhurtham  panchangam  

Other Articles