సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ గత వారం ఆస్పత్రిలో పరావర్శించిన చిన్నారి శ్రీనిధి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటకు చెందిన శివాజీ, క్రాంతి కుమారిల కూతురు శ్రీనిధి గత మూడేళ్లుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది. శ్రీనిధి ఎన్టీఆర్ ఫ్యాన్ కావడంతో అతడిని చూడాలని ఆశపడుతోంది. ఈ మేరకు ట్విట్టర్ లో ఆ పాప కోరికను తల్లిదండ్రులు పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అమ్మాయిని పరామర్శించి చాక్లెట్ల్, ఆటబొమ్మలు ఇచ్చారు. ఆ అమ్మాయి త్వరగా కోలుకుని మన మధ్య ఆరోగ్యంగా తిరగాలని కోరుకుంటున్నానని, ఆ అమ్మాయి చికిత్స ఖర్చులు భరిస్తానని ఆయన అన్నారు.
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బంధనపల్లికి చెందిన శివాజీ, క్రాంతికుమారిలకు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా, వాళ్లలో శ్రీనిధి పెద్దకుమార్తె. ఆమెకు ఆరాధ్య, అలేఖ్య అనే ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. శ్రీనిధికి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. ఆయన నటించిన యమదొంగ సినిమా ఆమెకు బాగా గుర్తు. ఎన్టీఆర్ తనను చూసేందుకు వచ్చినప్పుడు కూడా యమదొంగ సినిమా గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించింది. తాను చిన్నారి శ్రీనిధి బాధను తీర్చలేకపోయినా.. కనీసం తనను చూడాలన్న ఆమె చివరి కోరికనైనా తీర్చగలిగానని ఎన్టీఆర్ ఆరోజు ఎంతగానో బాధపడ్డారు.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more