Jayalalitha | leaders | fans

Jayalalitha will meet her fans and party leaders today

Jayalalitha, leaders, fans

Jayalalitha will meet her fans and party leaders today. After a long gap Jayalalitha meets leaders today.

జనం ముందుకు జయలలిత

Posted: 05/22/2015 07:45 AM IST
Jayalalitha will meet her fans and party leaders today

జైలు నుండి బయటకు వచ్చిన తమిళనాడు మాజీ సిఎం, త్వరలో కాబోయే సిఎం జయలలిత ఈ రోజు జనాలకు దర్శనమివ్వనున్నారు. దాదాపు ఏడు నెలల తర్వాత జయలలిత కార్యకర్తల ముందుకు రానున్నారు. దాంతో అట కార్యకర్తలు, ఇటు అభిమానులు ఎంతో ఇంట్రస్టింగ్ గా ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆమె ఉదయం ఇక్కడి పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే పార్టీ ఎమ్మెల్యేల సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. భేటీలో ఆమెను తిరిగి శాసనసభా పక్ష నేతగా ఎన్నుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. సమావేశం తర్వాత ఆమె నగరంలోని అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్, ద్రవిడ నేత అన్నాదురై, హేతువాద నేత పెరియార్ రామస్వామి విగ్రహాలకు నివాళి అర్పిస్తారు.

 జయలలిత దర్శనం కోసం పార్టీకార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ఆస్తుల కేసులో బెయిల్‌పై గత ఏడాది అక్టోబర్‌లో బెంగళూరు నుంచి చెన్నై వచ్చాక జయ ఇంటికే పరిమితమయ్యారు. ఈ కేసులో కర్ణాటక హైకోర్టు ఆమెను ఇటీవల నిర్దోషిగా తేల్చడం తెలిసిందే. జయ సీఎంగా ఎప్పుడు ప్రమాణం చేస్తారనే దానిపై పార్టీ నేతలు పెదవి విప్పకున్నా ఈ నెల 22-24 మధ్య ఆమె ప్రమాణం చేసే అవకాశముందని భావిస్తున్నారు. మరోపక్క శనివారం జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా జయలలితను సిఎం కుర్చీ ఎక్కకుండా చెయ్యడానికి కరుణానిధి బ్యాచ్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రెండు సార్లు కోర్టులో కేస్ వేసినా.. పెద్దగా ప్రయోజనంలేకపోవడంతో తాజాగా మరోసారి కోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalitha  leaders  fans  

Other Articles