telugudesamparty | TDP | Election commission | Raghuveerareddy

Congress party leaders demand to quit recognisation of telugudesamparty

telugudesamparty, TDP, Election commission, Raghuveerareddy

Congress party leaders demand to quit recognisation of telugudesamparty. Appcc president raghuveerareddy fire on telugudesam party.

తెలుగుదేశం పార్టీ గుర్తింపు రద్దు..!?

Posted: 05/26/2015 01:03 PM IST
Congress party leaders demand to quit recognisation of telugudesamparty

తెలుగు వారి ఆత్మగౌరవం అంటూ ఎన్డీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ గుర్తింపుపై తాజాగా ఫిర్యాదులు అందాయి. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చెయ్యడంతో ఘోరంగా విఫలమైందపి కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. అందుకే  టీడీపీ ఎన్నికల గుర్తింపును రద్దు చేయాలని వారు హైదరాబాద్లో ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ దాదాపు 600 హామీలు ఇచ్చిందని ఏపిపిసిసి ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గుర్తు చేశారు.

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో కొన్నింటిని మాత్రమే అమలు చేసిందని చెప్పారు. మరికొన్ని హామీలపైన అయితే టీడీపీ తాకనైనా తాకలేదని రఘువీరా విమర్శించారు. టీడీపీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు పరిచేందుకు ఆ పార్టీపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. అలాగే వాటి కోసం నిత్యం పోరాటం చేస్తున్నామని రఘువీరా స్పష్టం చేశారు. పైగా ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం వారి అనుమతితో తెలుగుదేశం పార్టీ వుబ్ సైట్ ను మార్కెట్ చేసుకుందని ఆరోపించారు. గతంలో హామీలను ప్రచారం చేస్తూ తీసిన వీడియోలను తెలుగుదేశం పార్టీ వెబ్ సైట్ల నుండి కావాలనే తొలిగించారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telugudesamparty  TDP  Election commission  Raghuveerareddy  

Other Articles