maneating | fishes | phirana | godavari,

Man eating fishes in the godavari rever

maneating, fishes, phirana, godavari,

Man eating fishes in the godavari rever. Recvently wild life istitute of india found new fishes, which will eat man.

మనుషుల్ని తినే చేపలు.. అదీ గోదావరినదిలో..?

Posted: 05/26/2015 06:49 PM IST
Man eating fishes in the godavari rever

పిరానా సినిమా చూశారా.? అందులో చేపలు మనుషు మాంసాన్ని తింటాయి. అక్కడెక్కడో అట్లాంటాలో చాలా ఏళ్ల క్రితం కనిపించిన ఈ చేప చుట్టాలో ఏంటో తెలియదు కానీ తాజాగా గోదావరి నదిలో వీటిలాగే ఉన్న చేపలు మంచినీటి నదుల్లో మాత్రమే ఉండే ఈ హారర్ ఫిష్ ఆంధ్రప్రదేశ్-లోని గోదావరి నదిలో ఇటీవలే ప్రత్యక్షమైంది. అయితే.. అదృష్టవశాత్తూ ఏపీ, తెలంగాణల్లో కనిపించిన ఎర్ర పొట్ట గల పిరన్హాస్ గతంలో ఇతర ప్రాంతాల్లో మనుషుల మీద చేసినంత తీవ్ర స్థాయిలో దాడులు మాత్రం చేయడంలేదట. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గత ఏడాది పిరన్హాస్ చేపను డెహ్రాడూన్-లోని వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తొలిసారిగా గుర్తించింది. అప్పటి నుంచి ఈ చేపలు గోదావరి నదిలో చాలాసార్లు కనిపించాయి. మత్స్యకారుల వలలో పడిన ఈ చేపలను మార్కెట్-లో పెట్టి వినియోగదారులకు విక్రయించినట్లు నివేదికలు చెబుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో షేక్ సలావుద్దీన్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న దక్కన్ యాంగ్లర్స్ చేపపిల్లల విత్తన కేంద్రంలో ఈ పిరన్హాస్ చేపను గుర్తించారు.

బాల్ కట్టర్ అనే పేరు కూడా ఉన్న ఈ భయంకరమైన పిరన్హాస్ చేపలు గోదావరి నదిలో అనేకం ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ చేపలు ఉన్న నీటిలో దిగిన మగవాళ్ళ వృషణాలను కొరిక్కుని తినేస్తాయని ఆ నివేదికలు వెల్లడించాయి. ఈ చేపలు ఇప్పుడు గోదావరి నది పరీవాహక ప్రాంతంలో సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. వీటిని ‘రూప్ చంద్’ అనే పేరుతో గోదావరి జిల్లాల వాసులు పిలుస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో ఇవి కృష్ణా నదిలో కూడా ఉన్నాయని పలుమార్లు రూఢి అయింది. మరో పక్కన చేపలను ఆహారంగా తీసుకునే గోదావరి ప్రాంత ప్రజలకు ఇవి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. చాలా ఎగ్రెసివ్-గా ఉండే పిరన్హాస్ చేపలు గోదావరిలో ఉండే మామూలు చేపలను చంపి మింగేస్తున్నాయి. దీంతో సాధారణ చేప సంతతి హరించిపోయే ప్రమాదం ముంచుకువస్తోంది. డెడ్లీ పిరన్హాస్ చేపలను నిర్మూలించకపోతే భవిష్యత్తులో మామూలు చేప మాంసం దొరకని దుస్థితి ఎదురవుతుందని హెచ్చరికలు వస్తున్నాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maneating  fishes  phirana  godavari  

Other Articles