Mansoon, Telangana, ap, Temperature

Telangana and ap may get mansoon soon

Mansoon, Telangana, ap, Temperature

Telangana and ap may get mansoon soon. With in two to three days arriving mansoon may cool the weather.

చల్లటి కబురు.. చల్లదనం కబురు

Posted: 05/26/2015 07:52 PM IST
Telangana and ap may get mansoon soon

గత వారం రోజుల నుండి ఎండలు మండిపోతున్నాయి. ఇక ఎండలకు తట్టుకోలేక వందల మంది జనాలు చనిపోయారు. ఎండ వేడిమి తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 700 పైచిలుకు ప్రజల ప్రాణాలను హరించింది అంటేనే పరిస్థితి ఎల ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే భానుడి భగభగలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఊరట లభించనుంది. మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నట్లు విశాఖ వాతావరణం కేంద్రం తెలిపింది.  చత్తీస్ గఢ్ నుంచి కోస్తాంధ్రా మీదుగా తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేసింది. మొత్తానికి ఎండలు జనాలకు చెమటు సట్టిస్తే తాజాగా వర్షాలు సడతాయన్న వార్త నిజంగా ఆనందాన్నే కలిగిస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mansoon  Telangana  ap  Temperature  

Other Articles