Mahanadu | Telugudesamparty | chandrababu | nara lokesh | balakrishna

Telugudesamparty mahanadu starts from today

Mahanadu, Telugudesamparty, chandrababu, nara lokesh, balakrishna

Telugudesamparty mahanadu starts from today. The party cader completed all the arrangements. Tdp mahandu willbe conduct for three days.

నేటి నుండి టిడిపి మహానాడు

Posted: 05/27/2015 07:52 AM IST
Telugudesamparty mahanadu starts from today

తెలుగుదేశం మహానాడుకు రంగం సిద్ధమమైంది. నేటి నుంచి మూడు రోజులపాటు జరగనున్న మహానాడు రంగారెడ్దిజిల్లా మొయినాబాద్‌ మండలంలోని గండిపేటలో జరగనుంది. టిడిపికి ఇది 34వ మహానాడు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడం, తెలంగాణలో పార్టీ ప్రతిపక్షంలో ఉంటున్న సమయంలో సమావేశాలకు ప్రాధాన్యం నెలకొంది, రాష్ట్ర విభజన అనంతరం జరుగుతున్న తొలి మహానాడును ఖర్చుకు వెనుకాడకుండా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. 30 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. మహానాడు కోసం వేదిక, సభాప్రాంగణం, పార్కింగ్‌, మీడియా సెంటర్‌, వంటశాల, అలంకరణ తదితర ఏర్పాట్ల విషయంలో టిడిపి అన్ని ఏర్పాటల్ను చేసింది.  హైదరాబాద్‌ నగరంతోపాటు శివారు ప్రాంతాలతోనూ జెండాలు, ప్లెక్సీలు, బ్యానర్లు, ప్లకార్డులు, భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. రహదారులకు ఇరువైపులా తోరణాలు భారీగా కట్టారు. దీంతో రోడ్లన్నీ పసుపుమయంగా మారాయి. గండిపేట వెళ్లే ఔట్‌రింగ్‌రోడ్లు జంక్షన్‌ దగ్గర అలంకరణ బాగా ఉంది.

చంద్రబాబు, బాలకృష్ణ, యువత లోకేష్‌, ఇతర నేతల ఫోటో కటౌట్లు భారీగానే ఏర్పాటు చేశారు. మహానాడుకు వచ్చే ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా 32 వంటకాలతో కూడిన 'మెనూ' సిద్ధం చేశారు. ప్రతిరోజు ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్‌, రాత్రి డిన్నర్‌తోపాటు పలుమార్లు ద్రవపదార్ధాలు అందించనున్నారు. వేసవితాపం తీర్చేందుకు మజ్జిగ, ఇతర చల్లనిపానీయాలను ఏర్పాటు చేశారు. పెద్ద పెద్ద కూలర్లను వేదికపైన, సభా ప్రాంగణంలోనూ, మీడియా గ్యాలరీలోనూ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా మీడియా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎలక్ట్రానిక్‌ కార్డులున్న పార్టీకి చెందిన క్రీయాశీల సభ్యులను మాత్రమే మహానాడు సభాప్రాంగణంలోకి అనుమతించనున్నారు.  మహానాడుకు వచ్చే వారికి ప్రతినిధులకు పాసులు, సెక్యూరిటీ, కేటరర్‌, మీడియా, ఇతర పాసులు సైతం అందజేశారు. వీటిని వెంట తీసుకురాకుండా అనుమతి ఉండదని మీడియా కమిటీ ఛైర్మన్‌ ఎల్‌విఎస్‌ఆర్‌కె.ప్రసాద్‌ తెలిపారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌ నుంచి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, సానుభూతిపరులు, మహిళలు, ఇతలు హాజరవుతున్నారు. ఈనేపథ్యంలో భద్రతాపరమైన సమస్యలు రాకుండా ఇప్పటికే ఎపి, తెలంగాణ పోలీసులు సభాప్రాంగణం, వేదిక, ఎన్టీఆర్‌ మోడల్‌ ప్రాంతాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చంద్రబాబు మూడు రోజులు అక్కడే ఉండనున్నారు. యువనేత, కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahanadu  Telugudesamparty  chandrababu  nara lokesh  balakrishna  

Other Articles