Revenath Reddy, Vote, MLC, elections, TSP, ACB

Revanth reddy may get the bail

Revenath Reddy, Vote, MLC, elections, TSP, ACB

Revanth Reddy may get the bail. In note for vote scandel reventh Reddy hope to get bail soon.

రేవంత్ రెడ్డికి బెయిల్..!?

Posted: 06/05/2015 10:13 AM IST
Revanth reddy may get the bail

ఓటుకు నోటు వ్యవహారంలో ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత, టిటిడిపి ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి బెయిల్ వస్తోందా..? రేవంత్ రెడ్డి కూతురు నిశ్చితార్త సమయానికి ఆయన జైలు బయట ఉంటారా..? అంటే అవును అన్న సమాధానాలు వస్తున్నాయి. గత నాలుగుఐదు రోజుల నుండి సాగుతున్న పరిణామాలు అలాంటి సంకేతాలనే పంపుతున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డిని కలిసిన తెలుగుదేశం పార్టీ నేతలతో త్వరలోనే బెయిల్ వచ్చేస్తుందని ఆశాబావం వ్యక్తం చేశారట. ఇక రేవంత్ రెడ్డి ఇంట్లో జరగనున్న శుభకార్యం నాటికి రేవంత్ రెడ్డి ఉంటారు అంటూ అప్పుడే చర్చ సాగుతోంది. ఇక ఏసీబీ అధికారులు వ్యవహరించిన తీరు... వారు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ పై తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆధారంగా చూస్తే.. ఏసీబీ అధికారులు స్టింగ్ ఆపరేషన్ చెయ్యడం ఎంత మాత్రం చెల్లుబాటు కాదు అంటూ టిడిపి నేతలు అంటున్నారు.

మరో పక్క టిటిడిపి నాయకుడు రేవంత్ రెడ్డిని బయటకు తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని సమాచారం. రేవంత్ రెడ్డి బెయిల్ మీద తొందరలోనే వస్తారని తెలుస్తోంది. కోర్టులో బెయిల్ పిటిషన్ ఇప్పటికే దాఖలు చేసిన రేవంత్ రెడ్డి తరఫు లాయర్లు అన్ని ఫైళ్లను సిద్దం చేసుకున్నారు. కాగా తెలంగాణ సర్కార్ కేసులో గట్టిగా వ్యవహరిస్తుండటంతో ఒకవేళ కోర్టులో గనక బెయిల్ దొరకని పక్షంలో వెంటనే హైకోర్టును ఆశ్రయించాలని.. మొత్తానికి ఎలాగోలా బెయిల్ సాధించాలని రేవంత్ రెడ్డి గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి  పక్క బెయిల్ తెచ్చుకునే పనిలో ఉంటే.. ఏసీబీ అధికారులు మాత్రం రేవంత్ రెడ్డిని తమ కస్టడీకి తీసుకోవాలని చూస్తున్నారు. ఈమేరకు పిటిషన్ కూడా వేశారు. మరి రేవంత్ వ్యవహారంలో ఏం జరుగుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revenath Reddy  Vote  MLC  elections  TSP  ACB  

Other Articles