Narachandrababu, ap, TDP, capital, Muhurtham

Narachandrababu naidu facing trouble time from past ten days

Narachandrababu, ap, TDP, capital, Muhurtham

Narachandrababu Naidu facing trouble time from past ten days. The Telugudesamparty leaders thinking that bad muhurtham for cm pledge ceremony and ap capital inaughration.

అందుకేనా.. బాబుకు బ్యాడ్ టైం

Posted: 06/05/2015 10:29 AM IST
Narachandrababu naidu facing trouble time from past ten days

నారా చంద్రబాబు నాయుడుకు గత వారం పది రోజుల నుండి అస్సలు కలిసి రావడం లేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతల్లో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి అరెస్టు చెయ్యడంతో తెలుగుదేశానికి, చంద్రబాబుకు షాక్ ఎదురైంది. ఉన్న తలనొప్పి చాలదన్నట్లు మంత్రి పీతల సుజాత ఇంట్లో నోట్ల కట్టల మూట కనిపించడంతో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇటు తెలంగాణలో టిఆర్ఎస్, అటు ఏపిలో జగన్ ఆపకుండా మాటల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. దాంతో తీవ్ర వత్తిడికి గురైన చంద్రబాబు నాయుడకు సరిగా నిద్ర పట్టడం లేదట. దాంతో అసలు ఇంత బ్యాడ్ టైం ఎందుకు..? ఎలా..? వస్తోంది అంటూ ఆరా తియ్యడం మొదలు పెట్టారు. ఇక్కడేఇంట్రస్టింగ్ న్యూస్ తెలిసింది. బాబుకు బ్యాడ్ టైం నడవడానికి అసలు కారణం అది అంటూ తెలుగుదేశం తమ్ముళ్లు దాదాపుగా నిర్దారణకు వచ్చారట.

ఏపి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన ముహూర్తం ఏమీ బాగోలేదట. అందుకే ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పటి నుండి చంద్రబాబుకు ప్రశాంతత లేకుండా పోయిందని కొంత మంది వాదిస్తున్నారు. ఇక మరికొందరి వాదన మరోలా ఉంది. ఏపి రాజధానికి రేపు అంటే జూన్ 6న తలపెట్టిన భూమి పూజ ముహూర్తం బాగోలేదని అందువల్లే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అంటున్నారు. దీనికి శ్రీనివాస గార్గేయ చెప్పిన మాటలను సాక్షాలుగా కూడా చూపుతున్నారు. మొత్తానికి చంద్రబాబు నాయుడుకు బ్యాడ్ టైం ఎందుకు స్టార్ట్ అయింది అంటే మాత్రం గ్రహ బలం లేకనే అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. మరి ఇది ఎంత వరకు నిజమో ఆ దేవుడికే తెలియాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narachandrababu  ap  TDP  capital  Muhurtham  

Other Articles