Chandrababu naidu, capital city, ap, Bhuvaneshwari

Narachandrababu naidu wife faceing problem at boomi pooja of capiotal city

Chandrababu naidu, capital city, ap, Bhuvaneshwari

Narachandrababu naidu wife faceing problem at boomi pooja of capiotal city. Chandrababu naidu wife Bhuvaneshwari hand frctured last few days ago.

కష్టపడ్డ చంద్రబాబు భార్య

Posted: 06/06/2015 10:55 AM IST
Narachandrababu naidu wife faceing problem at boomi pooja of capiotal city

ఏపి రాజధాని అమరావతిలో భూమి పూజ కార్యక్రమానికి ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ ఉదయం మూడు గంటలకు వేద పండితులు మంత్రోఛ్చారణ మధ్య శాస్ర్తోత్తంగా రాజధాని పూజ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపి చరిత్రలో కొత్త శకానికి నాంది పలికేలా రాజధాని నిర్మాణాన్ని చేపట్టడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. అయితే ఈ ఉదయం 8గంటల 49 నిమిషాలకు చంద్రబాబు నాయుడు దంపతులు భూమి పూజ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి మాత్రం పూజా కార్యక్రమంలో ఇబ్బంది పడ్డారు. పక్కనే ఉన్న చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరికి సహకరించారు.

భూమి పూజకు వచ్చిన చంద్రబాబు, భువనేశ్వరీలు పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే రాజధాని నిర్మాణంలో భాగంగా వేసిన బొడ్రాయి మీద బంగారు తాపితో సిమెంట్ వేసిన చంద్రబాబు తర్వాత తన భార్య భువనేశ్వరికి అవకాశం కల్పించారు. కానీ తాజాగా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి జారిపడి.. చేయికి ప్యాక్చర్ అయింది. దాంతో చేతికి పట్టీలతోనే వచ్చిన భువనేశ్వరి ఎడమ చేతితోనే సిమెంట్ వేశారు. అలాగే చంద్రబాబు నాయుడు నాగలితో దున్నేప్పుడు కూడా ఎడమ చేతితోనే ధాన్యాలు జల్లారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu naidu  capital city  ap  Bhuvaneshwari  

Other Articles