governer narasimhan takes care of note for vote issue says dattatreya

Govener will takecare of this issue

governer narasimhan takes care of note for vote issue says dattatreya, Govener, Narasimhan, Audio tapes, Bandaru Dattatreya, union minister dattatreya

union minister bandaru dattatreya meets governer narasimhan as cash for vote rocks two telugu states

ఓటుకు నోటు కేసును గవర్నర్ చూసుకుంటారన్న దత్తన్న

Posted: 06/08/2015 09:45 PM IST
Govener will takecare of this issue

తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలన  రేపిన  ఓటుకు నోటు వ్యవహారం  మరింత ముదురుతోంది.  రాష్ట్ర పునర్విభజనకు ముందు తలెత్తే పరిస్థితులే మళ్లీ ఉత్సన్నమయ్యేలా వున్నాయి. ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య వైరుధ్యాలు తారాస్థాయికి చేరతున్నాయి. తాజాగా చంద్రబాబు, స్టీఫెన్సన్ ల ఆడియో రికార్డులు  మరింత అగ్గిని రాజేశాయి. ఈ నేపథ్యంలో  గవర్నర్ నరసింహన్ ను కేంద్ర మంత్రి దత్తాత్రేయ కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ తో చర్చించినట్టు సమాచారం. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న తాజా పరిణామాలు రెండు రాష్ట్రాలకు మంచివి కాదని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు.  ఈ ఆడియో టేపుల వ్యవహారంపై తాను ఇప్పడేమీ మాట్లాడలేన్నారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర గవర్నర్ చూసుకుంటారని కేంద్ర మంత్రి  స్పష్టం చేశారు.
 
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ఓటుకు నోటుకు వ్యవహారంలో నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫన్సన్ ను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రలోభపెట్టినట్టు ఆడియో టేపులు బహిర్గతమై సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.  దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి-స్టీఫెన్  వీడియో  రేపిన ప్రకంపనలతో ఇప్పటికే  రేవంత్ రెడ్డి ఎసీబీ అదుపులో ఉన్నారు.  ఈ నేపథ్యంలో ఎపీ సీంఎంకు   ఏసీబీ  అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం కనబడుతోంది.  దీనిలో భాగంగానే ఏసీబీ డీజీ ఏకే ఖాన్ .. సీనియర్ అధికారులు,  న్యాయ నిపుణులతో భేటీ అయ్యారు. ఓటుకు నోటు కేసు విచారణ కోసం  ఇవాళో రేపో చంద్రబాబు నాయుడుకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Govener  Narasimhan  Audio tapes  Bandaru Dattatreya  

Other Articles