revanth reddy follows jail orders with sincerely | revanth return charlapalli jail after daughter nymisha engagement ceremony

Revanth reddy return charlapalli jail after daughter nymisha engagement follows court orders

revanth reddy, revanth daughter engagement, revanth reddy photos, revanth reddy controversy, nymisha engagement, revanth daughter nymisha engagement, nymisha engagement photos, revanth reddy acb court, acb court news, revanth reddy arrest, revanth reddy nymisha engagement

revanth reddy return charlapalli jail after daughter nymisha engagement ceremony : After completing the ceremony of daghter nymisha's engagement revanth reddy return to charlapalli jail. He follows the rules of court orders sincerely.

కోర్టు ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించిన రేవంత్

Posted: 06/11/2015 05:54 PM IST
Revanth reddy return charlapalli jail after daughter nymisha engagement follows court orders

‘ఓటుకు నోటు’ కేసులో శిక్ష అనుభవిస్తున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి.. తాత్కాలిక బెయిల్ పై విడుదలై గురువారం కుమార్తె నైమిశ నిశ్చితార్థానికి హాజరయ్యారు. ఉదయం 6 గంటలకు జైలు నుంచి విడుదలైన ఆయన.. 6.40 నిముషాలకు ఇంటికి చేరుకున్నారు. జైలు నుంచి విడుదలై వచ్చిన తండ్రిని చూసి కుమార్తె ఒక్కసారిగా కన్నీటి పర్యంతమైంది. అటు కుటుంబసభ్యుల్లోనూ ఆనందభాష్పాలు వెలువడ్డాయి.

ఇక ఇంటి నుంచి ఆయన 8.30 నిముషాలకు ఎన్.కన్వెన్షన్ కు చేరుకున్నారు. ఈ వేడుకలకు ఏపీ సీఎం నారాచంద్రబాబు నాయుడుతోపాటు బాలయ్య ఇంకా ఇతర టీడీపీ మంత్రులు, ప్రత్యర్థ పార్టీ నాయకులు విచ్చేశారు. వీరందరు రేవంత్ ను మర్యాదపూర్వకంగా పలకరిస్తూ ఆలింగనం చేశారు. తాము తోడుగా వున్నాయంటూ ఆయనలో భరోసా కల్పించారు. ఇక నిశ్చితార్థం ముగిసిన అనంతరం సరిగ్గా 2.50 నిముషాలకు రేవంత్ తిరిగి ఇంటికి చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు కుటుంబసభ్యులతో గడిపిన ఆయన.. తిరిగి 4 గంటలకే చర్లపల్లి జైలుకు తరలారు. నిజానికి సాయంత్రం ఆరు గంటలకు వరకు సమయం వున్నప్పటికీ.. రేవంత్ మాత్రం 4 గంటలకే తిరిగి జైలుకు వెనుదిరిగారు. నిశ్చితార్థం నిమిత్తం ఏసీబీ అధికారులకు కూడా సివిల్ డ్రెస్సుల్లోనే రేవంత్ వెన్నింటి వున్నారు.

ఇదిలావుండగా.. కూతురి నిశ్చితార్థానికి హాజరై తిరిగి జైలుకు పయనమైన రేవంత్.. న్యాయస్థానం ఆదేశాలను తూ.చ. తప్పకుండా పాటించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, బంధువులు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించినా.. రేవంత్ మాత్రం కేవలం పలకరింపులు, ఆలింగనాలతోనే సరిపుచ్చారు. ఎవరితోనూ ఎక్కువసేపు మాట్లాడలేదు. కొద్దిసేపు బాబు పక్కన కూర్చున్నా.. ఆయనతోనూ అంతగా సంభాషణ కొనసాగించలేదు. పైగా.. రెండుగంటల గడువున్నా ముందే ఆయన జైలుకు తిరిగెళ్లడం విశేషం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : revanth reddy  nymisha engagement  chandrababu naidu  

Other Articles