ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పార్టీ సీనియర్ నేతల్లో గుజులు ప్రారంభమైంది. ఈ కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వీడియో, అడియో టేపులు నిజమైనవేనని తేల్చిచెప్పిన పక్షంలో ఎలా చేస్తే ఈ కేసు నుంచి బయటపడవచ్చునని తర్జనభర్ఝనలు పడుతున్నారు. ఈ కేసులో విచారణ ఎదుర్కునే పక్షంలో ఏం చెప్పాలి.. ఎలా చెప్పాలి.. ఇంకేం చేయాలి.. సలహాలివ్వరూ ప్లీజ్..అని చంద్రబాబు కోరుతున్నారట. దీనిలో భాగంగానే ఆయన ఆదివారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. ఈ భేటీలో ఏపీ డీజీపి జేవీ రాముడు, ఏసీబీ డీజీ మాలకొండయ్య, ఇంటిలిజెన్స్ఏడీజీలతో బాబు భేటీ అయ్యారు. ఒకవేళ కోర్టు నోటీసులు వస్తే ఈ కేసును ఎలా ఎదుర్కొవాలి అనే దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కౌంటర్ అటాక్ ఎలా చేయాలి? అనే అంశంపైనే వాటి భేటీ సాగినట్లు సమాచారం.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో ఓటు కొనుగోలు కోసం ప్రయత్నించి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కేసుకు సంబంధించిన అన్ని ఆడియో, వీడియో టేపులు పూర్తిగా నిజమైనవేనని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నిర్ధారించినట్లు విశ్వసనీయ సమాచారం. అవి ఎక్కడా ఉద్దేశపూర్వకంగా కత్తిరించి అతికినవి (కట్ అండ్ పేస్ట్) కావని తేల్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎఫ్‌ఎస్‌ఎల్ ఈ మేరకు ఏసీబీ అధికారులకు ప్రాథమిక నివేదికను అందించిందని, వీటికి సంబంధించి అధికారిక నివేదికలను సోమవారం నేరుగా కోర్టుకు అందించనుందని సమాచారం. ఈ నేపథ్యంలో తనను తాను రక్షించుకునేందుక చంద్రబాబు సాధ్యమైనన్ని మార్గాలను అన్వేషించే పనిలో భాగంగా అటు న్యాయనిపుణులు, చట్టానికి ప్రధినిధులుగా వున్న అధికారులు, పార్టీ సీనియర్ నేతలతో చర్చోపచర్చలు జరుపుతున్నారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more