ప్రధాని నరేంద్ర మోదీపై బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి విరుచుకుపడ్డారు. కాశ్మీర్ లో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తరువాత అక్కడి వేర్పాటు వాదులు ఇస్లామిక్ స్టేట్ జెండాలు ఎగురువేయడంపై ఆయన ప్రధానమంత్రి మోడీపై సూటీగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికలకు మందు మోదీ భారత ఆర్మీ దళాలకు చెందిన సైనికులు 56 అంగుళాల చాతి బలాన్ని వినియోగించుకోవడంలో విఫలమైందని విమర్శలు గుప్పించడంతో.. ఇప్పుడు వాటినే నితిష్ కుమార్ అస్త్రాలుగా మలుచుకున్నారు.
కశ్మీర్ లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జెండాలు ఎగురువేస్తుంటే మోదీ ఛాతి బలం ఎక్కడకెళ్లిందని తీవ్రంగా విమర్శించారు. గత సాధారణ ఎన్నికల్లో తన ఛాతి బలాన్ని అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన మోదీ.. బీజేపి మద్దతుతో పిడిపీ నేతృత్వంలో ఏర్పాటైన జమ్మూ కళ్మీర్ లో ప్రభుత్వంలో.. పాకిస్తాన్, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల జెండాలు ఎగురవేస్తుంటే ఏమి చేస్తున్నారని నిలదీశారు. 'మోదీజీ ఇప్పుడు మీకు ఏమైంది?, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులపై చర్యలు ఏవి?, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారా?, ఆ 56 అంగుళాల ఛాతి బలం ఎక్కడ? అని నితీష్ సూటిగా ప్రశ్నించారు.
శ్రీనగర్లోని ఓ మసీదు వద్ద శుక్రవారం మధ్యహ్నం ప్రార్థనల అనంరతం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జెండాలను ఎగరేశారు. అలాగే జమ్ములోని కుప్వారా జిల్లాతో పాటు కాశ్మీర్లో కూడా పాకిస్థానీ జెండాలు మళ్లీ కనిపించాయి. హురియత్ నాయకుడు మీర్వాయిజ్ ఉమర్ ఫరూఖ్ మద్దతుదారులు ఇస్లామిక్ స్టేట్ జెండాలను జమామసీదు సమీపంలో ఎగరేశారు. ఇంతకుముందు పలు సందర్భాల్లో పాకిస్థానీ, లష్కరే తాయిబా జెండాలు కూడా కాశ్మీర్ లోయలో కనిపించినా.. ఇస్లామిక్ స్టేట్ జెండాలు కనిపించడం మాత్రం ఇదే మొదటిసారి కావడంతో విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రం మొతక వైఖరి కారణంగానే ఇలాంటి చర్యలకు వేర్పాటు వాదులు పాల్పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more