main accused osd samai jaan rao held in Navjeevan Express train robery case

Osd samaijan is the main accused in gold robery case

nellore, navajeevan express, andhra pradesh, train robbery, navajeevan express, osd samai jaan rao, nellore, main accused osd samai jaan rao, master mind behind navajeevan express robbery, Navjeevan Express robery case

The Nellore Police arrested main accused osd samai jaan rao in the Navjeevan Express robbery case, who was the master mind beyond the case.

ITEMVIDEOS: పోలీసు దొంగకు అరదండాలు.. దోపిడి అసలు సూత్రధారి ఓఎస్డీ

Posted: 06/15/2015 09:31 PM IST
Osd samaijan is the main accused in gold robery case

నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలు దోపిడీ కేసు సంచలన మలుపు తిరిగింది. సరిగ్గా నెల రోజుల వ్యవధిలో ఈ కేసును అత్యంత చాకచక్యంగా పోలీసులు చేధించారు. 24 గంటల వ్యవధిలోనే దోపిడీకి పాల్పడిన ముగ్గురు కానిస్టేబుళ్లను అరెస్టు చేసిన పోలీసులు.. ఈ మొత్తం వ్యవహరం వెనుకనున్న అసలు సూత్రదారిని మాత్రం ఇవాళ అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. గత నెల 13న నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలులో బంగారం వ్యాపారి నుంచి రూ. 90 లక్షల దోపిడీ కేసులో  ప్రధాన సూత్రధారి ప్రకాశం జిల్లా మార్కాపురం ఓఎస్డీడీ  సమయ్‌జాన్‌రావేనని తేలడంతో నెల్లూరు జిల్లా పోలీసులు సోమవారం ఆయనను అరెస్టు చేశారు.

తమ గూటికి చెందిన పక్షి అని తెలిపినప్పటికీ.. నెల్లూరు పోలీసులు అయనకు అరదండాలు విధించారు. ఏఎస్పీ హోదా కలిగిన సమయ్ జాన్ రావు గత నాలుగేళ్లుగా మార్కాపురంలో  ఓఎస్డీగా పనిచేస్తున్నారు.  ఏఆర్ కానిస్టేబుళ్లతో కలిసి సమయ్ జాన్ రావు భారీ దోపిడీకి పథకం రచించారని, తమ దర్యాప్తులో అందుకు తగిన ఆధారాలు లభ్యమయ్యాయని నెల్లూరు ఎస్పీ చెప్పారు. నిందితులను కావలి కోర్టులో హాజరుపర్చడంతోపాటు శాఖపరమైన చర్యలకు కూడా తీసుకోనున్నట్లు తెలిపారు.

ఈ నెల 14న శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన బంగారు వ్యాపారులు వేమూరి రాము, సునీల్ రూ. 82 లక్షల నగదుతో కావలి రైల్వే స్టేషన్ నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు వెళ్తున్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు  పోలీసులమని చెప్పి తుపాకీ చూపించి వారిని బెదిరించారు.  పడుగుపాడు స్టేషన్ సమీపంలో ఆ రైలు నెమ్మదిగా వెళుతున్న సమయంలో విచారణ పేరుతో  ఇద్దరు వ్యాపారులను కిందకు దించారు. వారిని నెల్లూరు ఆత్మకూరు బస్టాండు వద్దకు తీసుకెళ్లి,  అక్కడ నుంచి అంబాసిడర్ కారును బాడుగకు తీసుకుని, దగదర్తి మండలం దామవరం వద్దకు వెళ్లారు. ఆ తరువాత వారి వద్ద ఉన్న 82 లక్షల రూపాయలను తీసుకుని వ్యాపారులను వదిలి పారిపోయారు. బంగారు వ్యాపారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఘటన జరిగిన మరుసటిరోజే నిందితులను అరెస్టు చేయడంతోపాటు వారు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : train robbery  navajeevan express  osd samai jaan rao  nellore  

Other Articles