acb notice for tdp mla sandra venkata veraiah

Acb serves notice to another tdp mla

acb notice, TDP, MLA sandra venkata veraiah, ACB, sandra venkata veeraiah, satup[ally mla, note for vote, governer, chandrababu, KCR, High Court Judge, RGV, muthaiah jerusalem, vijayawada police, cash for vote, chandra babu, revanth reddy, acb, note for vote, bribery case, horse riding, Kcr, telangana mlc elections, revanth reddy bail, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, acb, sunita reddy, geeta reddy, jaipal reddy, jana reddy, horse riding

Telangana ACB officials went to hyderguda mla quarters to serve notice to TDP Leader, sathupally mla sandra venkata veeraiah in connection with cash for vote row, , but returns as he is not available

ఎమ్మెల్యే కోనుగోలు కేసులో మరో టీడీపీ ఎమ్మెల్యేకు ఏసీబి నోటీసులు

Posted: 06/16/2015 10:16 PM IST
Acb serves notice to another tdp mla

ఓటుకు నోటు కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ఇప్పటి వరకు జరుగుతున్న ఊహాగానాలకు దూరంగా వున్న వ్యక్తులు కీలకం కాబోతున్నారు. వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ ప్రత్యక్ష కార్యచరణకు దిగింది. రోజంతా ఏసీబీ నోటీసులిస్తుందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటట వీరయ్యను విచారణ అధికారి ముందు హీజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఏసీబీ బృందం హైదర్ గూడలోని టీడీపీ ఎమ్మెల్యే ఇంటికి (క్వార్టర్స్ నంబర్ 208) వెళ్లగా ఆయన అందుబాటులో లేరు.

టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఇంట్లో కూడా ఎవరూ లేకపోవడంతో ఇంటి గోడలకు నోటీసులను అంటించారు. ఆయనపై సీఆర్పీసీ సెక్షన్ 160 కింద కేసు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు పట్ల దూకుడుగా వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. రేపు కూడా మరికింత మంది టీడీపీ నాయకులకు, ప్రజా ప్రతినిధులకు,  నోటీసులు జారీ చేసే అవకాశముందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : note for vote  acb notice  TDP  MLA sandra venkata veraiah  ACB  sandra venkata veeraiah  

Other Articles