ఒటుకు నోటు వ్యవహరాంలో గత పక్షం రోజులుగా మిన్నకుండిన ఎన్నికల కమీషన్.. ఎట్టకేలకు ఈ వ్యవహరంలో స్పందించింది. ఎన్నికల కోడ్ అములలో వుండగా, రేవంత్ రెడ్డిని ఏసీబి అధికారులు అరెస్టు చేయడమేంటని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఇన్నాళ్లు వాదించిన టీడీపీ నేతలకు మింగుడు పడని విధంగా ఎన్నికల కమీషన్ స్పందించింది. రేవంత్ రెడ్డి అరెస్టుకు ముందే ఎన్నికల కమీషన్ దృష్టికి ఓటుకు నోటు వ్యవహరాన్ని ఏసిబి డీజీ ఏకే ఖాన్ తీసుకెళ్లడంతో.. ఇన్నాళ్లకు ఈ వ్యవహారంపై ఈసీ స్పందించింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న భన్వర్‌లాల్ ఈ కేసుకు సంబంధించి పంపిన లేఖకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతిస్పందిస్తూ తాజా లేఖ పంపింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగనందున ప్రస్తుతం ఈ కేసులో జోక్యం చేసుకోబోమని కూడా కేంద్ర ఎన్నికల సంఘం తన లేఖలో స్పష్టం చేసింది. ఈ కేసులో తెలంగాణ ఏసీబీ చివరివరకూ దర్యాప్తు కొనసాగించాలని సూచిస్తూ ఎన్నికల సంఘం లేఖ పంపింది. పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆ లేఖలో ఈసీ సూచించింది.
కాగా, ఇదే కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చెయ్యడానికి ముందే ఈసీకి తెలంగాణ ఏసీబీ చీఫ్ ఏకే ఖాన్ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సమగ్రంగా దర్యాప్తు చేయాలని, విచారణ సజావుగా సాగాలని ఏకే ఖాన్ కు లేఖ రాసింది. ఓటుకు నోటు వ్యవహరాంలో పూర్తిగా విచారణ చేయాలని ఏసిబి డిజీ ఏకే ఖాన్ కు ఆదేశించిన ఈసి కేసులో లాజికల్ ఎండ్ కనుక్కోవాలని సూచించింది. కాగా ఈ వ్యవవారంలో ఏసీబి డీజీ ఏకే ఖాన్ ఇప్పటి వరకు రెండు పర్యాయాలు ఈసికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more