congress mp hanumantha rao controversial comments on narendra modi | Vote for note | chandrababu naidu

Congress mp hanumantha rao controversial comments on narendra modi chandrababu naidu

hanumantha rao, congress mp hanumantha rao, narendra modi, chandrababu naidu, vote for note

congress mp hanumantha rao controversial comments on narendra modi

దేశాన్ని పాలిస్తోంది ప్రధాని మోదీ కాదట!

Posted: 06/19/2015 06:37 PM IST
Congress mp hanumantha rao controversial comments on narendra modi chandrababu naidu

రాజకీయరంగంలో ఎప్పుడెలా వ్యవహరిస్తారో ఎవ్వరికీ తెలియదు. సొంత పార్టీ నాయకులే ఒఖరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే సందర్భాలూ ప్రస్తుతరోజుల్లో మరీ ఎక్కువయిపోయాయి. ఇక ప్రత్యర్థి పార్టీ నాయకులైతే నిత్యం విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంటుంటారు. పైగా.. ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రకరకాల పరిణామాలపై ఏమాత్రం స్పందించకపోవడంతో.. ఇదే మంచి సమయం అని భావించి ఆయన మీద తీవ్రస్థాయిలో కొందరు నాయకులు మండిపడుతున్నారు. ఆయన ఈ దేశాన్ని పాలించే ప్రధానిలా వ్యవహరించడం లేదని కొందరు అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.

ఇప్పటికే బీజేపీ కురువృద్ధుడు అద్వానీ మోడీ మీద పరోక్షంగా నిప్పులు చెరగగా.. ఈయనకు అనుగుణంగానే తాజాగా కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. దేశాన్ని పరిపాలిస్తున్నది ప్రధాని నరేంద్రమోదీ కాదని, ఆర్‌ఎస్‌ఎస్ ఏం చెబితే అదే జరుగుతోందని విహెచ్ మండిపడ్డారు. గాంధీభవన్‌లో శుక్రవారం వీహెచ్ విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఈ విధంగా మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఏడాది గడిచినా విదేశాల్లో దాగున్న నల్లధనాన్ని ప్రధాని మోదీ ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. పైగా దేశాన్ని లూటీ చేసి హవాలా ద్వారా విదేశాల్లో డబ్బుదాచిన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్‌మోదీని రక్షించడం సిగ్గుచేటన్నారు. ప్రధాని ప్రమేయం లేకపోతే వెంటనే కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజేలను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఓటుకు నోటు వ్యవహారాన్ని ఆయన తెరమీదకి తీసుకొచ్చారు. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రధాని మోదీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బాబు పచ్చి అవకాశవాది అని వీహెచ్ మండిపడ్డారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ప్రజలను రెచ్చగొడుతూనే, గవర్నర్‌ను దూషిస్తున్నారని దుయ్యబట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hanumantha rao  narendra modi  chandrababu naidu  

Other Articles