Tailpond | Telangana | AP

Telangana and andhrapradesh govt are fighting about the nagarjunasagar tailpond

another controvesary rocks between Telangana and Ap Governments, cash for vote, note for vote, phone tapping, nagarjuna sagar tail pond, renta chintala, new controversary,Telangana and Ap Governments, telangana government, Ap government, pulichintala, Telangana Energy department secretary adravind kumar, police security, tail pond

Telangana and andhrapradesh govt are fighting about the Nagarjunasagar Tailpond. Telanagana officers and ap officers clash for Tailpond.

టెయిల్ పాండ్ మాదంటే మాది.. కాదు మాది

Posted: 06/20/2015 08:27 AM IST
Telangana and andhrapradesh govt are fighting about the nagarjunasagar tailpond

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొత్తేమీ కాదు. అయితే గతంలో నాగార్జున సాగర్ వద్ద జరిగిన ఉద్రిక్తత దాదాపు అందరికి తెలిసే ఉంటుంది. నాగార్జున సాగర్ వద్ద రెండు రాష్ట్రాల పోలీసులు బాహాబాహీకి దిగడం.. పోలీసుల మీద పోలీసులే లాఠీ చార్జ్ చెయ్యడం సంచనమే సృష్టించింది. అయితే దానిపై గవర్నర్ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిపించి వివాదం సద్దుమణిగేలా చేశారు. అయితే అదే సీన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ మాదంటే మాదేనని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వితండ వాదన చేస్తున్నాయి. టెయిల్ పాండ్ నిర్మాణ ఖర్చు తమ ఖాతాలోనే వేసినందువల్ల అది తమదేనని తెలంగాణ జెన్‌కో వాదిస్తుండగా.. తమ భూభాగంలో ఉన్నందున ముమ్మాటికీ తమదేనని ఏపీ ఇంధనశాఖ వాదిస్తోంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల మధ్య మరోవివాదం తెర మీదకు వచ్చింది. అసలే తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటున్న పరిస్థితిలో టెయిల్ పాండ్ వివాదం ఉద్రిక్తతకు తావిస్తోంది.  

తెలంగాణ, ఏపి రాష్ట్రాల మధ్య సాగుతున్న వివాదం చిలికిచిలికి గాలి వానగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా ఉన్న అంశాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ మాదంటే మాదని రెండు రాష్ట్రాలు వాదిస్తున్నాయి. మా భూభాగంలో ఉందని ఓ రాష్ట్రం అంటుంటే మరో రాష్ట్రం ఖర్చు మాదే కాబట్టి మాకు అధికారం ఉంది అంటూ భారీగా పోలీసులను మోహరించాయి. దాంతో టెయిల్ పాండ్ వద్ద ఎప్పుడు ఏం జరుగుతుందో అని టెన్షన్ వాతావరణం నెలకొంది. టెయిల్‌పాండ్‌ ఆధారంగా ఏపీ జెన్‌కో నిర్మిస్తున్న 50 మెగావాట్ల జల విద్యుత్కేంద్రం ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌నంతా ఏపీకే ఇస్తామని, నిర్వహణ మా త్రం కచ్చితంగా తమ నియంత్రణలోనే ఉండాలని పేర్కొం టున్నాయి. టెయిల్‌పాండ్‌ నిర్మాణానికి రూ.400కోట్లదాకా ఖర్చ యిందని, ఆ రుణం మొత్తాన్ని తెలంగాణ ఖాతాలో జెన్‌కో విభజన సమయంలో వేశారని, రుణభారాన్ని తెలంగాణకు ఇచ్చి, డ్యాం నిర్వహణను ఇవ్వబోమంటే ఎలాగని తెలంగాణ జెన్‌కో అధికారులు ప్రశ్నించారు. మొత్తానికి టెయిల్ పాండ్ వద్ద ఎప్పుడు ఏం జరుగుతుందో అని అటు పోలీసులు, ఇటు రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : note for vote  phone tapping  nagarjuna sagar tail pond  renta chintala  AP  Telangana  

Other Articles