Famous Team India fan Sudhir Gautam attacked in Dhaka | india vs bangladesh | sudhir gautam

Team india sachin tendulkar famous fan sudhir gautam attacked in dhaka

sudhir gautam, bangladesh, india vs bangladesh, bangladesh fans attack sudhir, team india famous fan sudhir gautam, sachin fan sudhir gautam, sachin tendulkar, team india loss against bangladesh, bangladesh vs india series, india loss oneday series

Famous Team India fan Sudhir Gautam attacked in Dhaka : Famous Sachin Tendulkar and Indian cricket fan Sudhir has claimed that he was attacked by Bangladesh fans in Dhaka after India's loss in the second one-day international on Sunday.

‘బంగ్లా’లో సచిన్ వీరాభిమాని సుధీర్ పై దాడి

Posted: 06/22/2015 05:35 PM IST
Team india sachin tendulkar famous fan sudhir gautam attacked in dhaka

భారతదేశ త్రివర్ణ పతాకాన్ని తన శరీరం మొత్తం రాసుకుని, ప్రపంచంలో ఎక్కడ భారత్ క్రికెట్ ఆడితే అక్కడ కనిపించే సచిన్ వీరాభిమాని సుధీర్ కు బంగ్లాదేశ్ లో చేదు అనుభవం ఎదురైంది. మైదానంలో దేశ పతాకాన్ని గాల్లో ఎగురవేస్తూ టీమిండియా ఆటగాళ్లను నిత్యం ఉత్సాహపరిచే ఈ బక్కపలుచని వ్యక్తిపై కొందరు బంగ్లా అభిమానులు దాడికి దిగి అతనిని నిరుత్సాహ పరిచారు.

వివరాల్లోకి వెళ్తే.. మిర్పూర్ లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో ఇండియా ఘోర పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే! దీంతో మైదానంలో వున్న భారత్ ఆటగాళ్లు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఆ అభిమానుల్లో సుధీర్ కూడా వున్నాడు. టీమిండియా ఘోర వైఫల్యాన్ని జీర్ణించుకోలేకపోయిన అతగాడు.. నిరుత్సాహంతో మైదానం బయటకు వచ్చాడు. అప్పుడు గెలుపుతో అహంకారం మీదున్న బంగ్లా అభిమానులు అతడిని ఉద్దేశించి మాటల తూటాలు విసిరారు. ఈ క్రమంలోనే బంగ్లా ఫ్యాన్స్ బృందం, సుధీర్ మధ్య ఉద్రిక్తత ఏర్పడింది. ఇంతలోనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. పోలీసులు సుధీర్ ని ఆటోదాకా తీసుకెళ్లారు. అప్పటికీ బంగ్లా ఫ్యాన్స్ విడిచిపెట్టలేదు. ఆ మూక ఆటోపైనా దాడికి యత్నించింది. రాళ్లు కూడా విసిరినట్లు సుధీర్ మీడియాతో వెల్లడించారు.

తనపై జరిగిన చేదు అనుభవాన్ని సుధీర్ మీడియాకు వెల్లడిస్తూ.. ‘మ్యాచ్ ముగియగానే స్టేడియం బయటికి వచ్చాను. అప్పుడు బంగ్లా ఫ్యాన్స్ నన్ను చుట్టుముట్టి నావద్దనున్న త్రివర్ణ పతాకాన్ని లాగడం ప్రారంభించారు. పతాకానికున్న హ్యాండిల్ ను వారు విరిచేశారు. అయితే.. అక్కడే వున్న ఇద్దరు పోలీసులు వచ్చి నన్ను ఆటోదాకా తీసుకెళ్లారు. అయినా వాళ్లు ఆటోపైనా దాడికి దిగారు. రాళ్లు కూడా విసిరారు. అదృష్టవశాత్తూ నాకు ఎలాంటి గాయాలు కాలేదు’ అని వివరించాడు. సుధీర్ పై జరిగిన ఈ దాడిని క్రికెట్ ప్రముఖులు ఖండించారు. దీనిపై చర్య తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అటు భారతీయ అభిమానులు ఈ ఉదంతంపై తీవ్ర ఆగ్రహంతో వున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sudhir gautam  sachin tendulkar  bangladesh fans  bangladesh vs india  

Other Articles