International Yoga Day | Rajpath event creates new Guinness World record | Narendra Modi

Delhi rajpath yoga event creates 2 new guinness world records

rajpath yoga event, international yoga day, narendra modi news, guinness world records, rajpath yoga records, naredra modi yoga classes, delhi yoga classes, largest yoga demonstration, yoga class at a single venue

Delhi Rajpath Yoga Event Creates 2 New Guinness World Records : Delhi Rajpath Yoga Event Creates New Guinness World Records for the "largest yoga demonstration or class at a single venue".

ఢిల్లీలో నిర్వహించిన ‘యోగా’కు రెండు ప్రపంచ రికార్డులు

Posted: 06/22/2015 06:13 PM IST
Delhi rajpath yoga event creates 2 new guinness world records

జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచదేశాలు జరుపుకున్న విషయం తెలిసిందే! ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని రాజ్ పథ్ వద్ద ‘యోగా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశిష్ట గౌరవం దక్కింది. ఈ కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఏకంగా రెండు ప్రపంచ రికార్డులను అందజేసింది.

ఢిల్లీలోని రాజ్ పథ లో ఒకే వేదికపై ప్రధాని, కేంద్రమంత్రులు, పలు దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులతో కలిసి సుమారు 39,985 మంది యోగాసనాలు ఆచరించారు. ఒకే వేదికపై ఇంతమంది అత్యధికులు యోగాసనాలు వేయడంతో ఈ కార్యక్రమం ‘గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు సంపాదించుకుంది. అలాగే 84 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ యోగా కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఇలా అత్యధిక దేశాలకు చెందిన వ్యక్తులు ఒకే వేదికపై యోగాసనాలు ఆచరించిన కార్యక్రమం ఇదే తొలిసారి కాబట్టి.. అందుకు గాను మరో రికార్డును కూడా గిన్నిస్ ప్రతినిధులు అందజేశారు. ఈ విధంగా యోగాకు రెండు ప్రపంచ పురస్కారాలు దక్కడంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ శ్రీపాద్ నాయక్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే.. ఇందులో పాలుపంచుకున్న వారంతా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.

rajpathi-yoga-image-01
rajpathi-yoga-image-02
rajpathi-yoga-image-03
rajpathi-yoga-image-04
rajpathi-yoga-image-05
rajpathi-yoga-image-06
rajpathi-yoga-image-07
rajpathi-yoga-image-08
rajpathi-yoga-image-09
rajpathi-yoga-image-10

ఇదిలావుండగా.. 2005లో వివేకానంద కేంద్రం ఆధ్వర్యంలో 29,973 మంది విద్యార్థులు యోగాసనాలు చేసి అప్పట్లో గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఇప్పుడు వారి రికార్డును రాజ్ పథ వద్ద జరిగిన యోగా కార్యక్రమం బద్దలు కొట్టింది. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు 24 కెమెరాలు, 200 మంది సాంకేతిక నిపుణులను వినియోగించింది. ఏదేమైనా.. ఈ యోగాకు రెండు పురస్కారాలు అందడం భారత్ కు గర్వించదగిన విషయమని రాజకీయ విశ్లేషకులతోపాటు ప్రముఖులు చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajpath yoga event  international yoga day  guinness world records  

Other Articles