Telangana | ACB | Govt | Funds | Cash for vote

Telangana acb got more funds from the telangana state govt

Telangana, ACB, Govt, Funds, Cash for vote, Revanth Reddy

Telangana ACB got more funds from the Telangana state Govt. Telangana ACB wrote a letter to the govt to provide funds for the further interagation.

తెలంగాణ ఏసీబీకి మరిన్ని డబ్బులు

Posted: 06/23/2015 08:41 AM IST
Telangana acb got more funds from the telangana state govt

యెంకి చావు సుబ్బి చావుకు వచ్చిందంటే ఇదేనేమో.. ఓటుకు నోటు కేసులో తెలంగాణ ప్రభుత్వానికి ఖర్చు తడిసిమోపెడవుతోంది. కేసు సంగతి ఎలా ఉన్నా ఏసీబీ శాఖకు కేటాయింపులు మాత్రం పెరిగిపోతున్నాయి. నిర్వహణ ఖర్చు పెరిగిపోవడంతో తెలంగాణ ఏసీసీ సర్కార్ కు నిధుల కోసం వినతి పెట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఓటుకు నోటు వ్యవహారం తెలంగాణ సర్కార్ కు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఎంతో ప్రాధాన్యమున్న ఈ కేసును ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన సాధారణ ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో అదనపు నిధులకోసం ఏసీబీ అధికారులు సర్కారును ఆశ్రయిస్తున్నారు. సర్కార్‌కు వినతి పంపించి అదనపు నిధులు సేకరిస్తున్నారు. మామూలుగా అయితే ఏదైన శాఖకు నిధులు అవరమైతే ప్రభుత్వానికి లేఖ రాస్తే అవసరాన్ని బట్టి ప్రభుత్వం కేటాయింపులు చేస్తుంది.

ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ ఏసీబీ అధికారులు టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించుకున్నారు. సీక్రెట్ గా షూట్ చెయ్యడానికి వాడిన కెమెరాలు, ఆడియో క్లారిటీ కోసం వాడిన స్పీకర్స్ లాంటి వాటి కోసం భారీగానే ఖర్చు చేశారు. ఎలక్ట్రానిక్ మెటీరియల్ తోపాటు ఇతరత్రా ఖర్చులు పెరిగిపోవడంతో అదనపు నిధులు కేటాయించాలని కోరుతూ ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌ సర్కార్‌కు లేఖ రాశారు. దీంతో 15 రోజుల్లో రెండు దఫాలుగా ప్రభుత్వం 37 లక్షలను విడుదల చేసింది. ఈ నెల 6న 12 లక్షలు, రెండో దఫాగా 25 లక్షలు విడుదలయ్యాయి. సాధారణ కేసుల మాదిరిగా కాకుండా ఓటుకు నోటు కేసును ఒక ఆపరేషన్’ స్థాయిలో చేపట్టడంవల్లే ఆర్థికభారం వచ్చిపడిందని.. అందువల్లే ఏసీబీ అధికారులు అదనపు నిధులు సేకరించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తానికి ఓటుకు నోటు కేసుతో ఏసీబీకి నిధుల కష్టాలు వచ్చిపడ్డాయి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  ACB  Govt  Funds  Cash for vote  Revanth Reddy  

Other Articles