Section8 | Hyderabad | Governor

May central govt will implement the section 8 in the common capital hyderabad

Section8, Hyderabad, Governor, Chandrababu, Telangana, Central Govt

May central govt will implement the section 8 in the common capital Hyderabad. Ap govt demanded for section 8 in hyderabad.

హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలుకు అంతా సిద్దం

Posted: 06/23/2015 09:11 AM IST
May central govt will implement the section 8 in the common capital hyderabad

ఇక అంతా సిద్దంగానే ఉంది. హైదరాబాద్ పై అధికారాలు ఉమ్మడి గవర్నర్ కు అప్పగించేందుకు అంతా సన్నద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో సెక్షన్8 అమలు చెయ్యడానికి గవర్నర్ కు దాదాపు లైన్ క్లీయర్ అయిందని సమాచారం. తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన నేపథ్యంలో హైదరాబాద్ లోని సీమాంధ్రులకు రక్షణ లేదని కాబట్టి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో పది ఏళ్లపాటు సెక్షన్8 అమలు చెయ్యాలని ఏపి ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌-8 ప్రకారం గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలున్నాయని భారత అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ తెలిపారు. హైదరాబాద్‌ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని కాబట్టి... నగరంపై ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలకు జ్యూరిస్‌డిక్షన్‌ ఉంటుందని చెప్పారు. సెక్షన్‌-8 మేరకు ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు, బాధ్యతలు ఉంటాయని అటార్నీ జనరల్‌ స్పష్టం చేశారు. సెక్షన్‌-8 అమలుకు సంబంధించి గవర్నర్‌ నరసింహన్‌ నోటిఫికేషన్‌ సిద్ధం చేసి కేంద్రానికి పంపించారని... దానిని కేంద్రం అటార్నీ జనరల్‌ పరిశీలనకు పంపించిందని సమాచారం.

రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలున్నాయి. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని కాబట్టి, నగరంలో రెండు రాష్ట్రాల పోలీసు బలగాలకు అధికార పరిధి ఉంటుంది. చట్టం ప్రకారం హైదరాబాద్‌లో శాంతి భద్రతల బాధ్యత గవర్నర్‌దే. అందువల్ల, గవర్నర్‌ రెండు రాష్ట్రాల పోలీసులను పిలిపించుకోవచ్చు. ఓటుకు నోటుపై నివేదికలు ఇప్పించుకుని పర్యవేక్షించవచ్చని ముకుల్‌ రోహత్గీ కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు. ఈ సూచనలను ముకుల్‌ రోహత్గీ మౌఖింగా తెలిపినట్లు అటార్నీ జనరల్‌ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే... ఆయన ఇదే అభిప్రాయాన్ని కేంద్రానికి పంపించారని తెలిసింది.మొత్తానికి సెక్షన్ 8పై క్లారిటీ రావడంతో రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌-8 ప్రకారం గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలున్నాయని భారత అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ తెలిపారు. హైదరాబాద్‌ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని కాబట్టి... నగరంపై ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలకు జ్యూరిస్‌డిక్షన్‌ ఉంటుందని చెప్పారు. సెక్షన్‌-8 మేరకు ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలపై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు, బాధ్యతలు ఉంటాయని అటార్నీ జనరల్‌ స్పష్టం చేశారు. సెక్షన్‌-8 అమలుకు సంబంధించి గవర్నర్‌ నరసింహన్‌ నోటిఫికేషన్‌ సిద్ధం చేసి కేంద్రానికి పంపించారని... దానిని కేంద్రం అటార్నీ జనరల్‌ పరిశీలనకు పంపించిందని సమాచారం. కాగా దీనిపై తెలంగాణ సర్కార్ మాత్రం మరోలా స్పందిస్తోంది. తెలంగాణలో శాంతి భద్రతలపై గవర్నర్ జోక్యం చేసుకోరనే అనుకుంటున్నామని అభిప్రాయపడుతోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Section8  Hyderabad  Governor  Chandrababu  Telangana  Central Govt  

Other Articles