2 Boys Killed By Islamic State For Eating During Holy Muslim Month Of Fasting | ISIS Crime News

Isis hanged 2 boys for eating during holy muslim month of fasting

isis militants, isis militants killed 2 boys, isis hanged 2 boys in ramzan, holy islamic month, ramadan festival, islamic state militants

ISIS Hanged 2 Boys For Eating During Holy Muslim Month Of Fasting : Islamic State militants reportedly hanged two boys for eating during Ramadan, the holy Islamic month of fasting.

తిన్నారని.. చంపేశారు ఆ క్రూరులు!

Posted: 06/23/2015 09:38 AM IST
Isis hanged 2 boys for eating during holy muslim month of fasting

ముస్లిముల పవిత్ర మాసమైన ‘రంజాన్’లో 30 రోజులపాటు ఉదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆహారం, నీరు తీసుకోకుండా ‘ఉపవాసం’ వుంటారు. ముఖ్యంగా అరబ్ దేశాలు ఈ రంజాన్ మాసాన్ని ఎంతో నియమనిబద్ధతలతో నిర్వహించుకుంటారు. అయితే.. ఈ రంజాన్ వేళల్లో ఇద్దరు ముస్లిం యువకులు ఆహారం తీసుకున్నారన్న విషయం తెలుసుకున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు.. వారిద్దరిని అత్యంత దారుణంగా చంపేశారు. ఈ ఘటన బీరూట్ డెయిర్ ఈజోర్ ప్రావిన్స్ లోని మాయాదీన్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని సిరియాకు చెందిన మానవహక్కుల సంఘ పర్యవేక్షకులు మంగళవారం వెల్లడించారు.

వివరాల్లోకి వెళ్తే.. బీరూట్ లో నివాసముండే 18 ఏళ్లకంటే చిన్నవారైన ఇద్దరు యువకులు ఈ రంజాన్ మాసంలో ఆకలి తాళలేక ఆహారం భుజించారు. ఎవరికీ తెలియకుండా ఎంతో జాగ్రత్తతో ఆహారం తీసుకోవాలని వారు ప్రయత్నించారు. కానీ.. ఈ విషయం ఎలాగో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు తెలిసింది. అంతే! వారు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. వెంటనే సదరు యువకులను వారు ఉరితీశారు. అంతేకాదు.. వారి మృతదేహాల వద్ద ముస్లిం పవిత్ర మాసమైన రంజాన్ ఆచరించివలసిన నియమనిబంధనలను వీరిద్దరు అతిక్రమించారని ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై కొందరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

ముస్లిం పవిత్ర మాసం రంజాన్ గత గురువారం నుంచి ప్రారంభమైంది. ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ మాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం తీసుకోకుండా వుంటారు. అయితే.. ఆ ఇద్దరు యువకులు రంజాన్ నియమనిబంధనలను అతిక్రమించి ఆహారం తీసుకున్నారని.. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఉరిశిక్ష విధించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isis militants  ramadan holy month  isis hanged 2 boys  

Other Articles