Telangana | Police | Anurag Sharma | DGP | Vaccancies

Telangana govt plans to release police job noptification as possible as fast

Telangana, Police, Anurag Sharma, DGP, Vaccancies

Telangana govt plans to release police job noptification as possible as fast. Telangana DGP anurag sharma clear that telangan govt will fill the all vaccancies in the police department.

పోలీస్ ఖాళీల భర్తీకి అంతా రెడీ

Posted: 06/23/2015 10:04 AM IST
Telangana govt plans to release police job noptification as possible as fast

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పోలీస్ ఉద్యోగాల భర్తీకి అంతా సిద్దంగా ఉందని తొందరలోనే నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు. ఎంతో కాలంగా ఊరిస్తున్న ఉద్యోగాల నోటిఫికేషన్ లు తొందరలోనే విడుదల చెయ్యనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే మొదటివిడతగా విడుదల చేసే నోటిఫికేషన్లలో మొత్తం ఇరవై ఐదు వేల పోస్టులు ఉండగా అందులో పదిహేను వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలు ఉంటాయని ప్రచారం సాగింది. అయితే తాజాగా తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ నోటిఫికేషన్ విడుదలపై వివరణ ఇచ్చారు. తెలంగాణలో శాంతి భద్రతలో ఎంతో కీలకంగా వ్యవహరించే పోలీస్ శాఖలో ఉన్న అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని అనురాగ్ శర్మి వివరించారు.

ఇప్పటికే తెలంగాణ సోలీసింగ్ ను అంతర్జాతీయ స్థాయి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్చలకు పూనుకుందని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ వివరించారు. తాజాగా బడ్జెట్ లోనూ పోలీస్ శాఖకు భారీగా నిధులు కేటాయించింది. గతంలో జరిగిన కేటాయింపుల కన్నా కూడా తెలంగాణ ప్రభుత్వం దాదాపు రెండు రెట్ల బడ్జెట్ నిధులను పెంచింది. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వంలోని వివిధ శాఖల్లోని ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చెయ్యడానికి ముందుకు వచ్చింది. అయితే మిగిలిన ప్రభుత్వ శాఖల కన్నా ముందుగా పోలీస్ శాఖలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చెయ్యడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉంది. అందులో భాగంగానే పద్దెనిమిది వేల పోలీస్ ఖాళీలను భర్తీకి సిద్దంగా ఉన్నామని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ వివరించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Telangana  Police  Anurag Sharma  DGP  Vaccancies  

Other Articles