PM Modi sees red as China blocks India's move seeking action against Pakistan over Lakhvi's release

China blocked india s move at un for action against pakistan over lakhvi s release

India, Pakistan, China, United Nations, Zakiur Rehman Lakhvi, China at UN, Lakhvi release, UN Sanctions Committee, Pakistan, MEA has tweeted their official reaction, China blocks India's move

India has reacted strongly to this incident. MEA has tweeted their official reaction which says India has taken up the matter at the highest level

లఖ్వీ అంశంపై ఐక్యరాజ్యసమితిలో భారత్ కు వ్యతిరేకంగా చైనా..

Posted: 06/23/2015 10:05 PM IST
China blocked india s move at un for action against pakistan over lakhvi s release

డ్రాగన్‌ దేశం తర వక్ర బుద్ధిని మళ్లీ చాటింది. పాకిస్తాన్‌కు చైనా మరోసారి అండగా నిలిచింది. ఐక్యరాజ్య సమితిలో భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించింది. ముంబై నరమేధానికి సూత్రధారి అయిన లఖ్వీ పాకిస్తాన్‌లో విచ్చలవిడిగా తిరుగుతున్నాడు. ఇస్లామాబాద్‌ హైకోర్టు ఆదేశాలతో ఈ ఏడాది ఏప్రిల్‌లో రావల్‌పిండి జైలు నుంచి విడుదల అయ్యాడు. ఈ వ్యవహారంపై ఆగ్రహించిన భారత్‌ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించింది. ఉగ్రవాద సంస్థలపై సమితి చేసిన తీర్మానానికి వ్యతిరేకంగా లఖ్వీని విడుదల చేశారని విన్నవించింది. పాక్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది.

ఈ మేరకు యుఎన్‌లో భారత శాశ్వత సభ్యుడు అశోక్‌ ముఖర్జీ ఐక్యరాజ్య సమితి ఆంక్షల కమిటీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌ నుంచి ఆ కమిటీ విరణ కోరుతుందని అంతా భావించారు. అయితే ఆ ప్రయత్నాలకు చైనా అడ్డు తగిలింది. భారత్‌ సరైనా ఆధారాలు సమర్పించలేదన్న సాకుతో పాకిస్తాన్‌కు పూర్తి బాసటగా నిలిచింది. దాంతో భారత దేశం ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. లఖ్వీ విడుదలపై అమెరికా, రష్యా, ఫ్రాన్స్‌, జర్మనీ తదితర దేశాలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశాయి. అతనిని మళ్లీ అరెస్టు చేయాలని అమెరికా డిమాండ్‌ కూడా చేసింది. అయినా పాక్‌ నుంచి స్పందన కరువయింది. పాక్‌కు చైనా అన్ని రకాలుగా మద్దతు పలుకుంది. ఇప్పుడు ఐరాసలోనూ చైనా తన వక్ర బుద్ధిని చాటుకుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : China at UN  Lakhvi release  UN Sanctions Committee  Pakistan  

Other Articles