Hyderabad, Liquior, Excise, Telaangana, Tourism

Telangana govt likely to open liquior shops from morning six to late night three

Hyderabad, Liquior, Excise, Telaangana, Tourism

Telangana govt likely to open liquior shops from morning six to late night three. In Hyderabad telangana govt plans to avail liquior 21 hours.

ఇక హైదరాబాద్ లో ఎనీ టైం మందు

Posted: 06/26/2015 11:07 AM IST
Telangana govt likely to open liquior shops from morning six to late night three

ఏటీఎం అంటే ఎనీ టైం మందు అనేట్లు కొత్త అర్థాన్ని తెలంగాణ సర్కార్ తీసుకువస్తోంది. అదేంటి ఏటీఎం అంటే ఎనీ టైం మనీ అని మామూలుగా అయితే అనుకుంటాం కదా కానీ ఏకంగా మందు అంటూ తెలంగాణ సర్కార్ అని కొందరి ఆలోచన. కానీ కొందరు మాత్రం టైటిల: చూడగానే ఎనీ టైం మందా... సూపర్ అని అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే మందు బాబుల కష్టాల గురించి చెప్పక్కర్లేదు. కనీసం మనస్పూర్తిగా మందు తాగుదామని అనుకునే మందు బాబులకు రాత్రి పదకొండు దాటితే మందు కరువు, మరుసటి రోజు ఉదయం పదకొండు గంటలకు గానీ మందు దొరకదు. కానీ ఇక మీదట మాత్రం అంత బాధపడక్కర్లేదు. జేబులో డబ్బులు ఉండాలే కానీ హైదరాబాద్ లో మందు ఎక్కడైనా దొరుకుతుంది. తాజాగా తెలంగాణ సర్కార్ తీసుకువస్తున్న పాలసీ పుణ్యమా అని మందు బాబులకు పూటుగా మందు దొరికే అవకాశం లభిస్తోంది.

హైదరాబాద్ లో ఇక మీదట నాన్ స్టాప్ కిక్కు కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా చర్యలు చేపడుతోంది. కిక్కు అంటే రవితేజ సినిమా అనుకునేరు... కానే కాదు మందు తాగితే ఎక్కే కిక్కు. అయితే హైదరాబాద్ టూరిజం ను డెవలప్ చెయ్యడానికి, విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి తెలంగాణ సర్కార్ మందును మరింత అందుబాటులోకి తీసుకురానుంది. అయితే తాజాగా హైదరాబాద్ లోని బార్లు, స్టార్ హోటల్స్, టూరిజం హోటల్స్ లలో ఉదయం ారు గంటల నుండి తెల్లారి మూడింటి వరకు మందు అమ్మకాలను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. అయితే ముందు మందు 24 గంటలు అందుబాటులో ఉంచాలని అనుకున్నా తర్వాత మాత్రం తెల్లాని మూడింటి నుండి ఆరింటి వరకు మాత్రం గ్యాప్ ఇచ్చారు. మొత్తానికి ఇక 24 గంటల్లో ఓ మూడు గంటలు తప్ప మిగిలిన టైంలో మందు దొరుకుందన్న మాట. ఇక మందు తాగి మజా చెయ్యాలనుకున్న జల్సా రాయుళ్లకు పండగే పండగ.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  Liquior  Excise  Telaangana  Tourism  

Other Articles