Drunk and Drive, Dlehi, Hyderabad, Police, Banglore

Police facing problems while drunk and drive in hyderabad

Drunk and Drive, Dlehi, Hyderabad, Police, Banglore

Police facing problems while drunk and drive. In hyderabad, Delhi, banglore police facing problems while the test drunk and drive.

ITEMVIDEOS: నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలుసా..?

Posted: 06/27/2015 03:52 PM IST
Police facing problems while drunk and drive in hyderabad

మందు బాబుల గొడవ చాలా ఎక్కువైంది. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకైతే సినిమా చూపిస్తున్నారు మందుబాబులు. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో వీకెండ్ వస్తే మందుు బాబులకు పండగే పండగ. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు మాత్రం తంటాలు తప్పడం లేదు. మొన్న బెంగళూరులో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా ఓ మహిళ తనను తాను కార్ లో లాక్ వేసుకొని కూర్చుంది. ఎంత మొత్తుకున్నా కానీ గంట వరకు కార్ దిగలేదు. అదే విధంగా హైదరాబాద్ లోనూ ఓ డాక్టరమ్మ ట్రాఫిక్ పోలీసులకు సినిమానే చూపించింది. బ్రీత్ ఎనలైజింగ్ టెస్ట్ కు ఎంతకూ ఒప్పుకోలేదు. దాదాపు రెండు గంటలు నానా రభస చేసింది. అయితే తాజాగా హైదనాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ పెద్ద మనిషి తగిలారు. అయితే తాను ఎవరో తెలుసా అంటూ పోలీసుల మీద నిప్పులు చెరిగారు.

అయితే అదేదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్లు నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలుసా..? తెలియందే పోలీస్ అయ్యావా .? అన్నట్లు అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ ఏమో కానీ నవ్వుల పువ్వులు పూసాయి. అయితే తాను ఎవరో తెలుసా..? అంటూ పదే పదే సదరు వ్యక్తి ప్రశ్నించడం అక్కడకున్న వారికి నవ్వు తెప్పించింది. అయితే ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా మంది పోలీసులకు చుక్కలు చూపుతున్నారు. అయితే పోలీసులు మాత్రం వీళ్ల పోరు భరించలేకపోతున్నారు. అయితే ఇందులో డాక్టర్లు, ఫ్యాషన్ డిజైనర్లు, విద్యార్థులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది పోలీసులకు చుక్కలు చూపుతున్నారు. అయితే కొన్ని సార్లు పోలీసులకు మందు బాబులు చుక్కలు చూపుతుంటే, కొన్ని సార్లు మాత్రం నవ్వు తెప్పిస్తున్నారు. మొత్తానికి డ్రంక్ అండ్ డ్రైవ్ మందు బాబులకేమో కానీ పోలీసులకు మాత్రం సవాల్ గా మారింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drunk and Drive  Dlehi  Hyderabad  Police  Banglore  

Other Articles