Hyderabbad | UT | section8 AP ministers | Pattipati Pullarao

Ap ministers demand to implement section 8 in hyderabad if section 8 implementation not possible then make hyderabad as ut

ap, Hyderabbad, UT, section8, AP ministers, Pattipati Pullarao, Governoe, Narasimhan

Ap MInisters Demand to implement section 8 in hyderabad if section 8 implementation not possible then make hyderabad as UT.

సెక్షన్ 8 కుదరకపోతే హైదరాబాద్ ను యుటి చెయ్యాల్సిందే

Posted: 07/01/2015 08:29 AM IST
Ap ministers demand to implement section 8 in hyderabad if section 8 implementation not possible then make hyderabad as ut

ఓటుకు నోటు వ్యవహారం తర్వాత నాటకీయంగా తెర మీదకు వచ్చిన హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలుపై ఏపి ప్రభుత్వం వాయిస్ పెంచింది. కేంద్రం మీద వత్తిడి కోసం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న ఏపి ప్రభుత్వం తాజాగా మాటలతో దాడికి సిద్దమైంది. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చెయ్యాలని గట్టిగా పట్టుబడుతున్నారు ఏపి మంత్రులు. అలాకాని పక్షంలో హైదరాబాద్ ను యూనియన్ టెరిటరీగా చెయ్యాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సెక్షన్ 8 అమలుపై గవర్నర్ సరసింహన్ త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. తమిళనాడు పోలీసుల్ని ఏపీలో అనుమతిస్తారా? అని ఒక రిటైర్డ్‌ జడ్జి ప్రశ్నించారని దానిపై ఏపి మంత్రి పత్తిపటా పుల్లారావు వివరణ ఇచ్చారు. తమిళనాడుకు-ఏపీకి ఉమ్మడి రాజధాని ఉందా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధాని కాబట్టి, హైదరాబాద్ పై తమకూ సమాన హక్కులు ఉన్నాయి కాబట్టే, అక్కడ పోలీసుల్ని పెట్టుకుంటుమన్నామని తెలిపారు. తమిళనాడు, ఏపీలకు ఉమ్మడి రాజధాని ఏపీలో ఉంటే అప్పుడు తమిళనాడు పోలీసుల్ని అనుమతించటంలో తప్పు లేదన్నారు. న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తికి ఈమాత్రం తెలియదా? అని ప్రశ్నించారు. సెక్షన్‌-8పై వివాదం మంచిది కాదనే ఏడాదిపాటు సహనంతో ఉన్నామని, అయినా సెక్షన్‌ 8 అమలు కాకపోవటంతో మాట్లాడాల్సి వస్తోందని చెప్పారు.

తెలంగాణ ప్రభుత్వం హయాంలో సీమాంధ్రుల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కావాలంటే ఖచ్చితంగా హైదరాబాద్ లో సెక్షన్ 8 ను అమలు చెయ్యాలని ఏపి మంత్రులు గట్టిగా పట్టుబట్టారు. ఏపికి చెందిన ముఖ్యమంత్రి, మంత్రులతో సహా పలువురు కీలక వ్యక్తుల ఫోన్లను తెలంగాణ సర్కార్ హైదరాబాద్ కేంద్రంగా ట్యాపింగ్ చేసిందని ఏపి ప్రభుత్వం మండిపడుతోంది. హైరదబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు కొనసాగనుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఎంత హక్కు ఉంటుందో, ఏపి ప్రభుత్వానికి కూడా అంతే హక్కు ఉందని వాదన. అయితే తెలంగాణ సర్కార్ హైదరాబాద్ పై ఆదిపత్యంతో ట్యాపింగ్ పాల్పడిండని, ఇలాంటివి పునరావృతం కాకూడదు అంటే ఖచ్చితంగా విభజన చట్టంలోని సెక్షన్ 8ని అమలు చెయ్యాలని ఏపి వాదిస్తోంది.

సెక్షన్‌-8 ప్రకారం ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉంటుందని చెప్పారు. సెక్షన్‌-8 అమలు పరచకపోతే ఉద్యమం చేస్తామని  మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. లేదంటే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఒత్తిడి చేస్తామని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌ తన అధికారాలను ఉపయోగించుకోవాలని కోరారు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌పై పదేళ్లపాటు గవర్నర్‌కే పూర్తి అధికారం ఉంటుందని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు చెప్పారు. ఏపీ, తెలంగాణ సీఎంలకు హైదరాబాద్‌పై అపరిమిత అధికారాలు ఉండవని అన్నారు. హైదరాబాద్‌లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా గవర్నర్‌ అనుమతి తప్పనిసరని చెప్పారు. ఉమ్మడి రాజధానిలో ఏపీకి అన్యాయం జరుగుతుంది కాబట్టే సెక్షన్‌ 8ని అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని అన్నారు. సెక్షన్‌ 8ని అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్‌దేనని , దీనిపై తెలంగాణ ప్రభుత్వం రాద్ధాంతం చేయడం తగదని మంత్రి మృణాళిని అన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap  Hyderabbad  UT  section8  AP ministers  Pattipati Pullarao  Governoe  Narasimhan  

Other Articles