Smitha Sabarwal, Outlook, cartoon, Notices, IAS union

Smitha sabarwal demand outlook to apologis to women across the country

Smitha Sabarwal, Outlook, cartoon, Notices, IAS union

Smitha sabarwal demand outlook to apologis to women across the country. Outlook publish a cartoon whicg like ugly as semilar as smitha sabarwal

ITEMVIDEOS: స్మితాసబర్వాల్ కు బాసటగా.. ఔట్ లుక్ పై విమర్శలు

Posted: 07/02/2015 08:15 AM IST
Smitha sabarwal demand outlook to apologis to women across the country

ఔట్ లుక్ తన తాజా సంచికలో ''నో బోరింగ్ బాబు'' అనే పేరుతో రాసిన కథనంపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఆ మ్యాగజైన్ యాజమాన్యంపై తీవ్రంగా స్పందిచారు. తన పరువుఏ ప్రతిష్టలను మంటగలిపేలా మ్యాగజైన్ కథనం ఉందని, ఇలాంటి చిల్లర మల్లర కథనాలు రాస్తూ జర్నలిజం చేయడం సమంజసంగా లేదని స్మితా సబర్వాల్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వూలో ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఇలాంటి కథనాలు రాయడం జర్నలిజం అనిపించుకోదని ఆమె అన్నారు. కాగా ఔట్‌లుక్‌’ పత్రిక క్యారికేచర్‌ వ్యవహారంలో న్యాయపోరాటానికి దిగిన తెలంగాణ సీఎంవో అదనపు కార్యదర్శి స్మితాసభర్వాల్‌కు ఐఏఎస్‌ అధికారుల సంఘం సంఘీభావం ప్రకటించింది. స్మితాసభర్వాల్‌ను అవమానించేలా ఔట్‌లుక్‌ ప్రచురించిన అసభ్య క్యారికేచర్‌పై సంఘం తరఫున కూడా కేసు నమోదు చేయాలని, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. తెలంగాణలోని ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల్లో సింహభాగం స్మితాసభర్వాల్‌ పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఆమెను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.

కాగా.. ఈ క్యారికేచర్‌పై బుధవారం జాతీయ ప్రసార మాధ్యమాల్లో విస్తృత చర్చ జరిగింది. జాతీయ మీడియాతో మాట్లాడిన స్మిత.. ‘‘కాలంతో పాటు మారుతున్న మహిళకు స్వేచ్ఛ ఉంది. కాలం మారింది. నేను ఏ దుస్తులు వేసుకోవాలో ఎంచుకునే హక్కు నాకుంది. నా హక్కును హరించే స్వేచ్ఛ ఎవరికీ లేదు’’ అని స్పష్టం చేశారు. సాంఘిక కట్టుబాట్లను ఎదిరించి... బయటకు వస్తుండటం జీర్ణించుకోలేకనే పురుషాధిక్య సమాజం ఇలాంటి ప్రచారం చేస్తోందని ఆమె ఆక్షేపించారు. 14 ఏళ్లుగా సివిల్ సర్వీస్ లో పనిచేస్తున్న తనపై ఈ తరహా దాడి జరగడం విచారకరమన్నారు. అసభ్య క్యారికేచర్‌ ద్వారా తననే కాదు యావత్‌ మహిళాలోకాన్నీ అవమానించినట్లేనని ఆమె అభిప్రాయపడ్డారు. తాను అసలు ఫ్యాషన్‌ షోకు వెళ్లలేదని, పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ డిజైనర్‌ నిర్వహించిన కార్యక్రమానికి వెళ్లానని వివరించారు. ఔట్‌లుక్‌పై న్యాయపోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smitha Sabarwal  Outlook  cartoon  Notices  IAS union  

Other Articles