SC says marriage compromises in rape cases lack 'sensitivity'

No compromise in rape case over wedlock supreme court

No compromise in rape case over wedlock, Supreme Court, gang rape accused, Madras High Court, rape case settlement, rape accused, Madras High Court, rape case settlement, rape, Supreme Court, Madras High Court, Mediation, Justice P Devadass

The Supreme Court on Wednesday observed that a woman's body is her temple and there should be no mediation and no compromise in rape cases

‘‘ అత్యాచార కేసులలో రాజీ కుదర్చుకోవడం కూడా నేరమే’’

Posted: 07/01/2015 11:33 PM IST
No compromise in rape case over wedlock supreme court

చిన్ననాటి నుంచి తమ కళ్ల ఎదుటే తిరిగిన అమ్మాయిని.. ఓ స్నేహితురాలిగా, ఓ సొదరిగా, భావించకుండా కామాంధులు పైశాచికత్వంతో వారిని కాటు వేసి బలత్కారాలకు, సామూహిక అత్యాచారాలకు తెగబడిన ఘటనలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. నగరాలను నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వైరస్ లా పాకుతున్న అత్యాచారాల పర్వాలు.. ఆ వెంటనే రంగంలోకి దిగుతున్న కుల పెద్దలు, కుల సంఘాలు, గ్రామ కమిటీలు తూతూ మంత్రంగా మగవాడికి నామమాత్రపు శిక్షలు విధించి, అత్యాచార బాధితురాళ్లకు మాత్రం ఎటూ తేలని తీర్పులను ఇస్తున్నాయి.

ఈ క్రమంలో  అత్యాచార కేసులపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. అత్యాచార కేసుల్లో మధ్యవర్తిత్వాన్ని ప్రొత్సహించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. అలా చేయడం పెద్ద తప్పిదం అవుతుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పైగా అది మహిళల గౌరవానికి భంగం కలిగించడమేనని సుప్రీం స్పష్టం చేసింది. అంతేకాదు నిందితులు, బాధితురాలితో రాజీ కుదుర్చుకోవడం కూడా నేరంగానే పరిగణించాలని సుప్రీం కోర్టు తెలిపింది.

ఇటీవల తమిళనాడు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు తప్పు పట్టింది. మద్రాస్‌ హైకోర్టు రేప్‌ కేసులో నిందితుడికి బైయిల్‌ ఇచ్చింది. బాధితురాలితో మధ్యవర్తిత్వం కుదుర్చుకునేందుకు వీలుగా బెయిల్‌ ఇస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక అత్యాచార కేసుకు సంబంధించిన విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rape  Supreme Court  Madras High Court  Mediation  Justice P Devadass  

Other Articles