ఓటుకు నోటు కేసులో నిందితుడిగా గత నెల రోజుల పాట్లు చర్లపల్లి జైలులో వున్న తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఏసీబి న్యాయస్థానం బెయిల్ ను మంజూరు చేయడంపై ఏసీబి అధికారులు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని డీల్ కుదుర్చుకన్న రేవంత్ రెడ్డి.. డీల్ లో భాగంగా 50 లక్షల రూపాయలను స్టీపెన్ సన్ కు ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబి అదికారులకు పట్టుబడిన కేసులో ఇంకా అనేక అంశాలపై విచారణ సాగుతున్న క్రమంలోనే రేవంత్ బెయిల్ ఏసీబి న్యాయస్థానం బెయిల్ ఇవ్వడాన్ని ఏసిబి అధికారులు సవాల్ చేస్తున్నారు.
ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ప్రజాస్వామ్యాని రేవంత్ రెడ్డి అపహాస్యం చేశారని, ఎమ్మెల్యేగా కోనసాగుతూ.. మరో ఎమ్మెల్యేను కోనాలని ప్రయత్నించారని ఏసీబి అధికారులు పిటీషన్ లో పేర్కోన్నట్లు సమాచారం. మరో పది మంది ఎమ్మెల్యేలను కొంటే ప్రభుత్వమే పడిపోతుందన్న విషయాన్ని కూడా పిటీషన్ లో పొందిపర్చినట్లు తెలుస్తోంది. ఈ పిటీషన్ రేపు విచారణకు వచ్చే అవకాశాలు వున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు రేవంత్ రెడ్డి బెయిల్ పై జైలు నుంచి విడుదల కాగానే ఆయన తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యాల టేపులను కూడా పిటీషన్ తో పాటు ఏసీబి అధికారులు కోర్టలో సమర్పించినట్లు సమాచారం. వీటితో పాటు కేసుకు సంబంధించిన పూర్వపారాలను కూడా పూర్తిగా సుప్రీంకోర్టు దృష్టికీ తీసుకురానున్నట్లు సమాచారం.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more