AAP MLA Bhavna Gaur in degree controversy

Aap mla bhavna gaur alleges conspiracy in fake degree row

AAP MLA Bhavna Gaur in degree controversy, bhavna gaur, fake degree row, fake educational certificates, jitender singh tomar, tomar fake degree row, aap mla bhavana gaur, aam aadmi party, aap government, india news, delhi news, Bhavana Gaur, Jitender Singh Tomar, AAP, Election Commission, Fake degree

In the 2013 affidavit, she claimed to have studied up to Class XII while in the affidavit for the 2015 election, she stated that she was a graduate from DU.

నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ల కేసులో మరో ఎమ్మెల్యే..

Posted: 07/03/2015 09:43 PM IST
Aap mla bhavna gaur alleges conspiracy in fake degree row

ఆప్ ఎమ్మెల్యేలను, మంత్రులను వివాదాలు వెంటాడుతున్నాయి. ఒక వైపై తమ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఢిల్లీ మాజీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ ను నకిలీ ధృవపత్రాల కేసులో అరెస్టు చేసిన తరువాత ఇప్పడు తాజాగా మరో ఎమ్మెల్యే భవనా గౌర్ చుట్టు అదే తరహా ఉచ్చు బిగిసుకుంటోంది. భావనా గౌర్ అనే మహిళా ఎమ్మెల్యే విద్యార్హతలు తప్పుడువంటూ దాఖలైన పిటీషన్ విచారణార్హమైనదేనని ఢిల్లీ కోర్టు భావించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేసినప్పుడు ఎన్నికల అధికారులకు అందజేసిన అఫిడెవిట్ లో అమె తప్పడు వివరాలు పేర్కోన్నారంటూ ఈ పిటీషన్ ధాఖలైంది.

మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పంకజ్ శర్మ ఈ కేసును విచారణకు స్వీకరించారు. 2013 డిసెంబర్ ఎన్నికల్లో ఒకలా, 2015 ఫిబ్రవరి ఎన్నికల్లో మరోలా అమె తన విద్యార్హతలను పేర్కోన్నారన్నది భావనా గౌర్ పై వినబడుతున్న ప్రధాన ఆరోపణ. 2013లో తాను 12వ తరగతి మాత్రమే చదివానని పేర్కోన్న భవనా గౌర్, 2015 ఎన్నికల నాటికి బి.ఏ, బిఈడీ చేసినట్లు పేర్కోన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 ఎ కింద సమరేంద్రనాథ్ వర్మ అనే వ్యక్తి ఈ పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసులో నేరం రుజువైతే ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా ఒక్కో క్రమంలో రెండూ విధించే అధికారం న్యాయమూర్తికి వుంటుంది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 25న న్యాయస్థానం వాయిదా వేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhavana Gaur  Jitender Singh Tomar  AAP  Election Commission  Fake degree  

Other Articles