కిల్లర్ స్కామ్ గా మారిన వ్యాపం కుంభకోణంపై విపక్షాల వత్తిడికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం దిగివచ్చింది. వేల కోట్ల రూపాయల మేర జరిగిన ఈ కుంభకోణంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న వారు వరుస అసహజంగా మరణాలు గురవుతుండటంపై దేశవ్యాప్తంగా కలకలం రేపడంతో.. ఎట్టకేలకు శివరాజ్ సింగ్ చౌహాన్ జనాగ్రహానికి తలొగ్గారు. ఈ కేసులో వేల సంఖ్యలో వున్న నిందితులు.. న్యాయస్థానానికి హాజరయ్యేందుకు కూడా జంకుతున్నారు. ఈ కేసును సిబిఐ చేత విచారణ జరిపించాలని విపక్షాలతో పాటు ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో కోరుకుంటుండటంతో.. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ మేరకు హైకోర్టుకు సిఫారసు చేస్తూ లేఖ రాస్తామని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ విచారణకు ఆదేశించాలని దాఖలైన నాలుగు ఫిటిషన్లపై ఈ నెల 9వ తేదీన సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశిస్తుందన్న సందేహంలో ఇన్నాళ్లు హైకోర్టు సిట్ ద్వారా విచారణ జరిపించాలని అదేశించింది. సిబిఐ విచారణ వద్దని చెప్పిందంటూ వచ్చిన ముఖ్యమంత్రి కాస్తా.. హడావిడిగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. వ్యాపం కుంభకోణంపై తాను సిబిఐ విచారణకు అదేశిస్తానని హామి ఇచ్చారు. అంతేకాదు ఈ మేరకు హైకోర్టుకు సిఫారసు చేస్తూ లేఖ రాస్తామని కూడా ఆయన చెప్పారు.
అంతకుముందు ఈ కుంభకోణంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యాపం స్కామ్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. అలా అని ఊరుకోలేదు.. మంత్రివర్యులు.. ప్రతి చిల్లర విషయానికి ప్రధాని స్పందించకూడదని ఆయన అన్నారు. సాధారణ అంశాలు, చిల్లర అంశాలకు ప్రధాని బుదులు చెప్పాల్సిన పని లేదని అన్నారు. హోంమంత్రి, సంబంధిత అధికారులు, అమిత్ షా ఇప్పటికే సమాధానం ఇచ్చారని ఆయన అన్నారు. దేశ విదేశాల జనహితానికి సంబంధించిన అంశమైతే ప్రధాన మంత్రి సమాధానం కోరడంలో తప్పులేదని గౌడ అన్నారు. ఒక కుంభకోణం వెలుగు చూసిన తరువాత ఈ కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగానో సంబంధమున్న 50 మంది చనిపోతే అది సాధరణ విషయమేనని మంత్రివర్యులు సెలవిచ్చారు. దీంతో గౌడ తీరుపై విపక్షాలు మండిపడ్డాయి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more