ప్రేక్షకాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ‘బాహుబలి’ సినిమా ఎట్టకేలకు జూలై 10న విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రంపై మీడియా కూడా పూర్తిస్థాయిలో దృష్టి పెట్టి మరింత పబ్లిసిటీ తెచ్చిపెడుతోంది. దాదాపు రూ.200 కోట్లకుపైగా బడ్జెట్ తో మూడేళ్లపాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేలా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించడంతో ఈ మూవీకి భారీస్థాయిలో హైప్ వచ్చేసింది. హాలీవుడ్ తరహాలో అద్భుతమైన గ్రాఫిక్స్ తో రూపొందిన ఈ సినిమా శుక్రవారం విడుదలవడంతో రెండు రాష్ట్రాల్లోనూ పండగ వాతావరణం నెలకొంది.
ఇక అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తమ అభిమాన హీరో సక్సెస్ అవ్వాలని విడుదలరోజు ఏదో ఒక సంచలనం సృష్టిస్తుంటారు. ‘బాహుబలి’ సినిమా విషయంలోనూ అలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. ఈ సినిమా ఇండియన్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు బద్దలు కొట్టాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా వికారాబాదులో ఫ్యాన్స్ ‘సినీమ్యాక్స్’ థియేటర్ వద్ద ఓ మేకను బలిచ్చినట్లు తెలిసింది. ‘బాహుబలి’ పోస్టర్ ముందు రక్తపు మడుగుల్లో పడివున్న ఆ మేకను ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టారు. ఇప్పుడీ ఫోటో తెగ హల్ చల్ చేస్తోంది. అయితే.. కేవలం ఓ సినిమా బంపర్ హిట్ అవ్వాలని కోరుతూ ఇలా మేకను బలివ్వడంపై కొందరు నెటిజన్లు తప్పు పడుతున్నారు. అభిమానం వుండాలికానీ.. మరీ మేకను బలిచ్చేంత ఓవర్ గా వుండకూదని వ్యతిరేక స్పందనలు వస్తున్నాయి.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more