ఉద్యమం ముగిసింది.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలగా ఏర్పడింది. అయితే ఉద్యమాన్ని నడపడంలో ఎంతో కీలకంగా వ్యవహరించిన టిఆర్ఎస్ పార్టీకి అధికారాన్ని కట్టబెడుతూ తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో తీర్పునిచ్చారు. అయితే ఎండా కాలమైనా, వానా కాలమైనా కొంత కాలమే ఉంటుంది. మరి అలాంటిది రాజకీయాల్లో ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అనుకుంటే మాత్రం పొరపాటే. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేసీఆర్ కు ఎలాంటి ఎదురు లేకుండా పోయింది. పార్టీలోకి వలసలను ప్రోత్సహిస్తు తెలంగాణలో ఏకైక పార్టీగా ఎదుగుతున్నారు. అయితే అంతా బాగానే ఉంది అని అనిపిస్తున్నా కానీ ఇప్పుడు సీన్ మాత్రం మారిపోయింది. ముందులాగా పరిస్థితులు లేకపోవడంతో కేసీఆర్ అంతర్మథనంలో పడ్డారు. అసలు కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు అంతర్మథనంలో పడింది..?
Also Read: తెలంగాణలో కొత్త జిల్లాలు ఇవేనా..?
Also Read: డీఎస్ కు తమ్మడిలా సాదరంగా పార్టీలోకి అహ్వానిస్తున్నా.. కేసీఆర్
* టిఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయిలో పటిష్టంగా లేకపోవడం చాలా మైనస్.
* టిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసింది కేవలం ఉద్యమం నేపథ్యంలోనే తప్ప కేసీఆర్ నాయకత్వం మీద నమ్మకంతోనో లేదా వేరే కారణాల వల్లో కాదు
* తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మాత్రమే టిఆర్ఎస్ పార్టీకి గట్టి పట్టుంది. కానీ మిగిలిన జిల్లాల్లో మాత్రం పట్టులేదు. ఉదాహరణకు మెదక్, కరీంనగర్ లాంటి జిల్లాల్లో గట్టి పట్టున్న టిఆర్ఎస్ కు మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో అంత పట్టులేదు.
* తాజాగా మహబూబ్ నగర్ బంద్ కు టిఆర్ఎస్ పిలుపునిచ్చింది. అయితే నిజానికి మహబూబ్ నగర్ జిల్లా టిడిపికి గట్టి పట్టున్న ప్రాంతం. ఒకప్పుడు జిల్లాలో అన్ని స్థానాలు టిడిపి గెలుచుకుంది. అందుకే చంద్రబాబు నాయుడు పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడ్డుపుల్ల వేస్తున్నారని బంద్ కు పిలుపునిచ్చింది. ఇలా ఒక్కో జిల్లాలో పార్టీకి ఆవించిన రీతిలో పట్టులేదు.
* పార్టీలోని నాయకులకు ప్రజల సమస్యల మీద పోరాటం చేసిన నేపథ్యలేదు. ఉద్యమ నేపథ్యంలో గెలిచారు తప్ప నిజానికి నాయకుల మొహాలు చూసి ఓట్లు పడ్డదాఖలాలు లేవు.
* పార్టీలో తలెత్తిన పరిస్థితిని చూసిన కేసీఆర్ అందుకు తగ్గట్లుగా కొత్తగా నాయకులకు వేరే పార్టీల నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
* వచ్చే ఎన్నికల్లో గతంలోలాగా సెంటిమెంట్ ఉండదు కాబట్టి అప్పుడు వ్యక్తులను బట్టి ఓట్లు పడతాయి. అందుకే కొత్తగా నాయకులకు చేర్చుకోవడం ద్వారా ఉద్యమపంథాకు గుడ్ బై చెబుతున్నారు.
* ఇక పార్టీలో చేరిన కేకే లాంటి వారికే మైకు దొరకడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ మాట్లాడుతూ హడావిడి చేసిన కేకేకు దిక్కులేకుండా పోయింది. మరి తాజాగా చేరిన మాజీ పిసిసి డిఎస్ పరిస్థితి ఎలా అవుతుందో చూడాలి.
* అందరికి మంత్రి పదవులు ఇస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఎంత మందికి పదవులు ఇస్తారు..? మిగిలిన వారి పరిస్థితి ఏంటీ..? మిగిలిన వారు పార్టీలో ఊరికే ఉంటారా.?
* హైదరాబాద్ లోనే పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాల పేర్లు లిస్ట్ తీస్తే వేళ్ల మీద లెక్కించవచ్చు. అందుకే ఎంఐఎం పార్టీని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులకోవడానికి టిఆర్ఎస్ పార్టీ సిద్దంగా లేదు. అందుకే రంజాన్ కు భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
* తమ డిమాండ్లపై మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల్లోని ఉద్యోగులు పలుమార్లు సర్కారు దృష్టికి తెచ్చినా స్పందించకపోవడంతో సమ్మె బాట పట్టారు. ఈ రెండు శాఖలను స్వయంగా ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రిగారి తనయుడు చూస్తున్నారు.
Also Read: సెక్షన్-8కు వ్యతిరేకంగా కేసీఆర్ సమర‘దీక్ష’..?
Also Read: హరితహారం అనేది మన ప్రోగ్రాం.. ప్రజల ప్రోగ్రాం
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more