Modi | Nawazshariff | pakistan | boarder | UFA | Russia, Bricks

Prime minister narendra modi held bilateral talks with his pakistani counterpart nawaz sharif on the sidelines of a summit at ufa in russia

Modi, Nawazshariff, pakistan, boarder, UFA, Russia, Bricks

Prime Minister Narendra Modi held bilateral talks with his Pakistani counterpart Nawaz Sharif on the sidelines of a summit at Ufa in Russia on Friday, a move that raised hopes for a thaw in ties between the two countries.

పాకిస్థాన్ లో మోదీ పర్యటన.. స్వయంగా ఆహ్వానించిన షరీఫ్

Posted: 07/10/2015 12:43 PM IST
Prime minister narendra modi held bilateral talks with his pakistani counterpart nawaz sharif on the sidelines of a summit at ufa in russia

ఉత్కంఠ వీడింది. అసలు కలుస్తారో కలవరో అనుకున్న ఆ ఇద్దరు నేతలు ముఖాముఖి చర్చకు పూనుకున్నారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఉగ్రవాదం విషయంలో పాక్ ద్వంద్వ  వైఖరిని విదేశీ పర్యటనలలో ఎండగడుతున్న ప్రధాని... షరీఫ్‌ ముందు కీలక అంశాలు చర్చించినట్లు సమాచారం. దాయాది దేశాల మధ్య కీలక చర్చలకు రష్యా వేదికైంది. బ్రిక్స్ దేశాల సమావేశంలో పాల్గొనేందుకు రష్యా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరికొన్ని గంటల్లో నవాజ్ షరీఫ్‌తో సమావేశం అయ్యారు. రష్యాలోని ఉఫా నగరంలో  భారత కాలమాన ప్రకారం ఈ ఉదయం ఇరుదేశాధనేతలు భేటీ అయ్యారు.  మోడీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాక్ ప్రధానితో అధికారికంగా ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొనడం ఇదే  తొలిసారి.  ఐక్యరాజ్య సమితి సమావేశాలు, సార్క్ సమావేశాల్లో మోడీ, షరీఫ్‌లు ఒకే వేదికపైకి వచ్చినా ఎడమొహం, పెడమొహంగానే ఉన్నారు. దీంతో ఇవాళ జరగనున్న అధికారిక భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read:  ఇండియాను పొగిడిన పాకిస్థాన్

ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తూ.. భారత్‌పైకి ఎగదోస్తూ..సరిహద్దుల్లో నిత్యం యుద్ధవాతావరణానికి కారణమవుతున్న పాకిస్థాన్ వైఖరిపై మోడీ సీరియస్‌గానే ఉన్నారు. భారత్‌ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా ముంబై పేలుళ్ల సూత్రదారి లఖ్వీని జైలు నుంచి విడుదల చేసిన పాక్ తన అసలు నైజాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఇద్దరు దేశాధినేతల భేటీకి కొన్ని గంటల ముందు కూడా పాక్ సరిహద్దుల్లో రెచ్చిపోయింది. పాక్ సైనికుల కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో జరుగుతున్న దేశాధినేతల సమావేశంలో ఎలాంటి చర్చ జరగుతుందనేది ఉత్కంఠగా మారింది.

Also Read:  ‘శృంగారం’ కోసం తపిస్తున్న పాక్ - అరబ్ కంట్రీలు...

లఖ్వీ విడుదలపై భారత్‌కున్న అత్యంతరాలను ప్రముఖంగా ప్రస్తావించనున్నారు మోడీ. పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు కోరుకుంటున్నామని ప్రతి సందర్భంలోనూ చెబుతున్న ప్రధాని ఆదిశగా... ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతిపాదనలు చేసే అవకాశముంది. బహుళ ప్రయోజన విశాలు , బ్యాంకుల ఏర్పాటు పై కూడా మోడీ, షరీఫ్‌లు చర్చించే అవకాశముందని విదేశాంగ శాఖ తెలిపింది. అయితే పాకిస్థాన్ లో పర్యటించాల్సిందిగా పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా ఆహ్వానించారు. దాంతో మోదీ కూడా అందుకు సంసిద్దత తెలిపారు. వచ్చే ఏడాది మోదీ పాకిస్థాన్ లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ కార్యదర్శి మీడియాకు తెలిపారు.

By Abhinavachary

Also Read:  పాకిస్థాన్.... జయలలిత ఫ్యాన్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Modi  Nawazshariff  pakistan  boarder  UFA  Russia  Bricks  

Other Articles