lady bosses are more powerful than gents in offices | Lady bosses | Women Employees

Lady bosses powerful than gents in offices

lady bosses, women bosses, angry lady bosses, private companies, women employees, women in private companies, women angry on men, lady boss with men

lady bosses powerful than gents in offices : lady bosses are more powerful than gents in offices according to the new survey.

ఆడ‘బాస్’లా.. మజాకా.. గుండెల్లో గుల్పం దిగిపోవాల్సిందే!

Posted: 07/13/2015 10:05 AM IST
Lady bosses powerful than gents in offices

నేటి ఫాస్ట్ జనరేషన్ లో మహిళలు అన్నిరంగాల్లోనూ పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా దూసుకుపోతున్నారు. చాలా సంస్థల్లో ఉన్నతోద్యోగులుగా రాణిస్తూ తమ సత్తా చాటుకుంటున్నారు. ఈ విషయం ఇంతవరకు అందరికీ తెలిసిందే కానీ.. తాజాగా ఓ నివేదికలో మహిళలకు సంబంధించి మరో అరుదైన విషయం బయటపడింది. టీమ్ ను నడిపించడంలో, వృత్తి విషయంలో, ఇతర వ్యవహారాల్లో ఖచ్చితంగా నడిపించడంలో మగవారికంటే మహిళలే ముందున్నట్లుగా అనేక సర్వేల్లో వెల్లడైంది. అంతేకాదు.. తాజాగా ఆడ‘బాస్’లకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం కూడా వెల్లడైంది. అదేమిటంటే.. సరైన ప్రవర్తన లేని, విపరీత బుద్ధి, పనిమీద ఎక్కువ ఆసక్తిలేని మగ ఉద్యోగులపై మహిళా బాస్ లు అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారని సమాచారం.

మిలాన్ లోని బొకోని యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనం ప్రకారం... కంపెనీల్లో ఆడ‘బాస్’ శక్తిసామర్థ్యాలకు వారి పర్యవేక్షణలో పనిచేస్తున్న మగ ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తేలింది. ఆడబాస్ లు వృత్తివ్యవహారంలో కఠినంగా వుండటంతో మగవారు ఆందోళన చెందుతున్నారని ఆ అధ్యయనం తెలిపింది. ఈ విషయంపై ఎకటెర్నియా అనే పరిశోధకుడు మాట్లాడుతూ.. ‘సమాజంలో లింగ వివక్ష చాలావరకు తగ్గుతోంది. మహిళలే తమ కుటుంబాల్ని పోషించేలా ఎదుగుతున్నారు. ఈ విషయం మహిళలు మరింతగా రాణించేందుకు దోహదపడుతోంది. అయితే.. ఈ స్థితి వల్ల పురుషులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆడబాస్ ల తీరుకు మగఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. స్త్రీ-పురుష సమానత్వాన్ని సమర్థిస్తున్న మగవారు సైతం ఈ విషయంలో ఆందోళన ఎదుర్కొనే అవకాశం వుంది’ అని పేర్కొన్నాడు.

ఈ అధ్యయనం నేర్పిన పాఠం ఏమిటంటే.. పురుషులు ఎంత తెలివిగలవారైనా ఆడ‘బాస్’లకు అనుగుణంగా నడుచుకుంటే మంచిదని అర్థమవుతోంది. లేకపోతే.. పరిణామాలు తారుమారువతాయని చెప్పకనే చెప్పొచ్చు. సో.. బాయ్స్ బీ కేర్ ఫుల్ విత్ లేడీ బాస్!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lady bosses  women employees  private companies  

Other Articles